TEJA NEWS

భూ భారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచం లాంటిది.

భూమి ఉన్న ప్రతి రైతు కు భూ భద్రత

మనిషికి ఆధార్ కార్డు లాగానే భూమికి భూదార్

రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోండి భూ సమస్యలను పరిష్కరించుకోండి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం శేరిలింగంపల్లి మండల పరిధిలో 3వ తేదీ నుండి 6వ తేదీ వరకు జరిగే రెవెన్యూ సదస్సులలో భాగంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డిలోని వార్డు కార్యాలయంలో జరిగిన రెవెన్యూ సదస్సులో శేరిలింగంపల్లి మండల డిప్యూటీ కలెక్టర్, తహసిల్దార్ వెంకా రెడ్డి ,కార్పొరేటర్లు గంగాధర్ రెడ్డి , రాగం నాగేందర్ యాదవ్ , నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ భూ భారతి – కొత్త ఆర్ ఓ ఆర్ చట్టమని అందులో భాగంగా భూమి హక్కులు భద్రం.. భూ సమస్యల సత్వర పరిష్కారం.. రైతుల మేలు కోసం ప్రజా పాలనలో చారిత్రక మార్పు అని పేర్కొన్నారు..భూ భారతి చట్టం.. రైతుల చుట్టమని అన్నారు. రైతుల మేలు కోసం ప్రజా పాలనలో చారిత్రక మార్పు కోసం ప్రభుత్వం అడుగులు వేస్తుందని అన్నారు. హక్కుల రికార్డులలో తప్పుల సవరణకు అవకాశం ఉంటుందని అన్నారు. ప్రభుత్వం భూధార్ కార్డుల జారీ చేస్తుందని, రైతులకు ఉచిత న్యాయ సహాయం చేసే విధంగా వెసులుబాటు కల్పిస్తుందని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సస్సులను
3 వ తేదీ నుండి 6వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు జరుగునని ,ఉదయం 10 గంటలకు నిర్దేషిత ప్రాంతంలో రెవెన్యూ సదస్సులు ప్రారంభమవు తాయని PAC గాంధీ వెల్లడించారు. 3వ తేదీన గోపనపల్లి, నల్లగండ్ల, నానక్రాంగూడ గ్రామాలకు సంబంధించి గౌలిదొడ్డిలోని వార్డు కార్యాలయంలో, గుట్టల బేగంపేట్, ఇజ్జత్ నగర్, గపూర్ నగర్, మాదాపూర్ గ్రామాలకు సంబంధించి మాదాపూర్ డివిజన్ పరిధిలోని కాకతీయ హిల్స్ లో గల వార్డు కార్యాలయంలో

4వ తేదీ ఉదయం 10 గంటలకు రాయదుర్గం కల్పా, రాయదుర్గం పాన్ ముఖా, రాయదుర్గం పైగా, దర్గాహుస్సేన్ షావలి, భాజాగూడా గ్రామాలకు సంబంధించి దర్గా హుస్సేన్ షావలిలోని వార్డు కార్యాలయంలో, మియాపూర్, రామన్నగూడ, మక్తా మహబూబ్ పేట్ గ్రామాలకు సంబంధించి మియాపూర్ లోని మయూరి నగర్ లో గల వార్డు కార్యాలయంలో ప్రారంభమవుతాయి.

5వ తేదీన ఉదయం 10 గంటలకు శేరిలింగంపల్లి, కొండాపూర్, గచ్చిబౌలి, కంచ గచ్చిబౌలి గ్రామాలకు సంబంధించి గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్ వార్డు కార్యాలయంలో, తారా నగర్, చందానగర్ గ్రామాలకు సంబంధించి చందానగర్ డివిజన్ పరిధిలోని గౌతమి నగర్ లో గల డివిజన్ వార్డు కార్యాలయంలో ప్రారంభమవుతాయి. చివరగా 6వ తేదీ ఉదయం 10 గంటలకు హఫీజ్ పేట్, కొత్తగూడ, మదీనగూడ గ్రామాలకు సంబంధించి హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ హఫీజ్ పేట్ లోని వార్డ్ కార్యాలయంలో రెవెన్యూ సదస్సు లు నిర్వహిస్తారు అని ,ఇట్టి సస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని PAC చైర్మన్ గాంధీ తెలిపారు.

గ్రామ గ్రామనా ఈ సదస్సును ఏర్పాటు చేస్తున్నారని ప్రతిఒక్కరూ క్షేత్రస్థాయిలో వారికి ఉన్నటువంటి సమస్యను సంబంధిత అధికారులకు తెలిపినట్లైతే సమస్యను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటారని అన్నారు. ప్రతి రైతుకు న్యాయం జరిగే విధంగా భూ భారతి చట్టం రూపొందించారని, ముఖ్య ఉద్దేశమని తెలిపారు. భవిష్యత్తులో ఏ రాష్ట్రంలో రెవెన్యూ చట్టం తయారు చేయాలన్న ఆదర్శంగా ఉండే విధంగా భూ భారతి చట్టాన్ని ప్రజా ప్రభుత్వం తయారు చేసిందని, దేశానికి ఆదర్శంగా భూ భారతి చట్టం నిలుస్తుందని PAC చైర్మన్ గాంధీ అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భూ భారతి నూతన ఆర్ ఓ ఆర్ చట్టం 2025 లో పొందుపరిచిన అంశాలు రైతుల సమస్యల పరిష్కారానికి ఎంతో మేలు చేస్థాయి అని, భూమి అనేది ఒక రైతు జీవితానికి చాలా పెద్ద ఆధారమని, ముఖ్యంగా భూ భారతి చట్టంలోఅప్పీలు వ్యవస్థ చాలా కీలకమైనది అని,రైతు కు ఒక వేళ అన్యాయం జరిగితే అప్పీల్ చేసుకోవడం ద్వారా న్యాయాన్ని పొందవచ్చు అని, ఆర్డీఓ, జిల్లా కలెక్టర్ ,సి సి ఎల్ ఏ స్థాయిలో అప్పీల్ చేసుకోవచ్చు అని,భూమి హక్కులను రక్షించడమే ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని తెలంగాణ భూభారతి చట్టం ద్వార భూమి రిజిస్ట్రేషన్ రికార్డుల నిర్వహణను పూర్తిగా పారదర్శకంగా రాష్ట్ర ప్రజల ప్రయోజనానికి అనుగుణంగా తీర్చిదిద్దామన్నారు ఇకపై భూవివాదాలకు స్థానం లేకుండా భద్రమైన భూమి హక్కులు అందరికీ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని,ఈ చట్టంతో సమస్యలను మండల స్థాయిలోనే పరిష్కరించుకోవచ్చన్నారు,పెండింగ్‌లో ఉన్న సాదా బైనామాలు సైతం భూభారతిలో పరిష్కారం చేసుకోవచ్చన్నారు.జూన్ నెల నుంచి తహసీల్దార్లు మండలంలోని ప్రతీ గ్రామంలో భూభారతి సదస్సులు నిర్వహించి రైతులకు భూసమస్యలపై అవగాహన కల్పించి వచ్చిన దరఖాస్తులను పరిష్కరించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు,రైతులు తమ భూములను ఆన్ లైన్లో చూసుకునే అవకాశం ఉంటుందన్నారు.గతంలో ఏవైనా భూ సమస్యలు వస్తే కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేదని భూ భారతితో 90శాతం తహసీల్దార్ వద్దే పరిష్కారం అవుతాయని తెలిపారు..లేదంటే ఆర్డీవో,కలెక్టర్లకు అప్పీల్ చేసుకోవచ్చన్నారు,భూసమస్యల పరిష్కారానికి ఎంతో వెసులుబాటు కల్పించే భూభారతి చట్టం పై అవగాహనను ఏర్పరచుకోవాలని, దీనిని వూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని PAC చైర్మన్ గాంధీ రైతులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది RI చంద్రారెడ్డి, అధికారులు మరియు నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.