
మాజీ ముఖ్యమంత్రికి ఎయిర్ పోర్టులో స్వాగతం
తిరుపతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి తిరుపతి ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది. ఆయన హైదరాబాద్ నుంచి చిత్తూరు జిల్లాలోని స్వగ్రామం నగిరిపల్లికి వెళ్లేందుకు విమానంలో తిరుపతి కి చేరుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి స్వాగతం చెప్పినవారిలో బీజేపీ సీనియర్ నేత నవీన్ కుమార్ రెడ్డి, డిసిసిబి చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, చంద్రగిరి బిజెపి ఇంచార్జ్ మేడసాని పురుషోత్తం నాయుడు, మహేష్, ఖాదర్, పలువురు పీలేరు నాయకులు చిన్నా, పుష్పరాజ్, బాబు తదితరులు ఉన్నారు.
