రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ అనంతబాబు

రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ అనంతబాబు

TEJA NEWS

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంగంగవరం మండలం జడేరు గ్రామ సచివాలయాన్ని, రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ అనంతబాబు , ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ,ఈ సందర్భంగా మాట్లాడుతూ
గ్రామ సచివాలయ వ్యవస్థ రావడంతో ప్రజలకు మెరుగైన పాలన అందుతుందని దానికి ప్రజాప్రతినిధులుగా గర్వపడుతున్నట్టు, ఎమ్మెల్సీ పేర్కొన్నారు,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం స్థాపించిన దగ్గర నుంచి ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు విప్లవాత్మకమైన పాలనకు తెర తీశారని పేర్కొన్నారు,ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరికీ తలుపుతట్టు మరి ఇవ్వాలని ఉద్దేశంతోనూ, పాలన ప్రజలకు మరింత చేరువు చేయాలన్న లక్ష్యంతోనూ గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారని పేర్కొన్నారు,గ్రామ సచివాలయ వ్యవస్థ వలన ప్రజలు అధికారులతో సమన్వయం కావడానికి మరింత అవకాశం ఏర్పడిందని పేర్కొన్నారు.
ఈ కార్య‌క్ర‌మంలో గంగవరం మండల కన్వీనర్, ఎంపీపీ, జడ్పిటిసి, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, సచివాలయం కన్వీనర్లు గృహస్థారధులు, వైస్ సర్పంచులు, వార్డ్ మెంబర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వివిధ కార్పొరేషన్ చైర్మన్ & డైరెక్టర్లు ,అధికారులు సచివాలయం సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS