రూ. 32లక్షలకు పైగా ఎరువులు, విత్తనాలు సీజ్ చేసిన సంబంధిత అధికారులు
గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ అధికారులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు.
గుంటూరు జిల్లాలో 6విత్తన ఉత్పత్తి అమ్మకం దారుల దుకాణాలు తనిఖీ చేశారు.
నిబంధనలు పాటించని వారి విక్రయ కేంద్రాల్లో రూ. 23. 31 లక్షల విలువైన 10. 33 క్వింటాళ్ల మిర్చి, పత్తి విత్తనాల విక్రయాలు నిలిపేశారు.
మిర్చి విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.