TEJA NEWS

Announcement on loan waiver soon: MP Mallu Ravi

త్వరలోనే రుణమాఫీపై ప్రకటన: ఎంపీ మల్లు రవి

త్వరలోనే రుణమాఫీపై ప్రకటన: ఎంపీ మల్లు రవి
బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ చేసినా కాంగ్రెస్‌ను ఎదుర్కోలేవని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తిరుగులేదు. ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేస్తాం. త్వరలోనే రుణమాఫీపై ప్రభుత్వం ప్రకటన చేస్తుంది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు. మిత్రపక్షాల దయాదాక్షిణ్యాలపై మోదీ ప్రభుత్వం ఉంది. కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం రాబోతోంది’ అని అన్నారు.


TEJA NEWS