చెకుముకి టాలెంట్ టెస్ట్ లో మండల ఫస్ట్ శ్రీ ఆదర్శ
జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండల స్థాయి చెకుముకి ప్రతిభా పరీక్ష చింతకాని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించారు. మండల వ్యాప్తంగా ఉన్న 15 ప్రభుత్వ , ప్రైవేటు పాఠశాలలకు చెందిన ఎనిమిది, తొమ్మిది, పదో తరగతి విద్యార్థులు ఈ ప్రతిభా పరీక్షకు హాజరయ్యారు. ఈ ప్రతిభా పరీక్షలో నాగులవంచ శ్రీ ఆదర్శ హై స్కూల్ విద్యార్థులు ప్రథమ స్థానం సాధించారు. పాఠశాలలో పదో తరగతి చదువుతున్న జక్కుల నవనీత్, తొమ్మిదవ తరగతి చదువుతున్న జక్కుల భాను ప్రసాద్, ఎనిమిదో తరగతి చదువుతున్న మందా నిరోషాలు ప్రథమ స్థానం సాధించారు. విజేతలకు చింతకాని ఎంఈఓ వీరపనేని శ్రీనివాసరావు, చింతకాని, లచ్చగూడెం
హై స్కూల్ హెచ్ఎంలు బీ.వీ. శర్మ , మహమ్మద్ హుస్సేన్, జన విజ్ఞాన వేదిక మండల బాధ్యులు ప్రవీణ్ , రాజయ్య, సీతారామారావు పాల్గొన్నారు.