పారిశుధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలి :మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి బాబు
చిలకలూరిపేట మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో పారిశుధ్య పనులను పకడ్బందీగా నిర్వహించాలని
మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి బాబు ఆదేశించారు. పట్టణానికి మంచినీటి సరఫరా అయ్యే పండరిపురం(రిజర్వాయర్ ) హెడ్ వాటర్ హౌస్ లోని వాటర్ ట్యాంక్ క్లినింగ్ తేదీని, వాటర్ హౌస్ లోని వాటర్ ట్యాంకర్ల వాహనాల ద్వారా రోజువారీగా పట్టణంలో ఏ ఏ ప్రాంతాలకు నీరు సరఫరా చేస్తున్నారో నమోదు చేసే రిజిస్టర్ ను పరిశీలించారు, తదుపరి
పురుషోత్తమ పట్టణం సుగాలి కాలనీ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణను ఆయన తనిఖీ చేశారు, పారిశుద్ధ పనుల నిర్వహణపై సుగాలి కాలనీ పురుషోత్తమ పట్నం లోని అక్కడి స్థానికులతో సంతృప్తిగా ఉన్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మున్సిపల్ కమిషనర్ హరిబాబు, పట్టణంలో పారిశుధ్య పనుల నిర్వహణపై ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా విధులు నిర్వర్తించాలని సచివాలయ సెక్రెటరీలకు శానిటేషన్ మేస్త్రులకు అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రతి వార్డులో చెత్తా చెదారంతో పాటు మురుగునీరు నిలువ ఉండకుండా చూడాలన్నారు. రహదారులు డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ బ్లీచింగ్ వేయాలన్నారు. మురుగునీరు నిల్వ ఉన్న చోట్ల దోమల నివారణకు ఆయిల్ బాల్స్ వేయాలని, వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పారిశుద్ధ్య పనుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ,స్వచ్ఛ చిలకలూరిపేటకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు