TEJA NEWS

కాంగ్రెస్ పార్టీకి ముందుంది ముసళ్ల పండగ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హెచ్చరించారు. దేశంలోనే కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పారు. హస్తం పార్టీ అయోధ్య రామమందిర నిర్మాణ ప్రతిష్ఠకు హాజరుకాకపోవడంతో హిందుత్వం పట్ల వారి వైఖరి క్లియర్గా అర్థమవుతుందని విమర్శించారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు..

దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) అన్నారు. హస్తం పార్టీకి ముందుంది ముసళ్ల పండగ అంటూ, ఆ పార్టీ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేక విధానం ఉందని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రామ మందిరం ధార్మిక కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించడం వల్ల హిందూ వ్యతిరేక ధోరణి ఏ విధంగా అవలంభిస్తోందో అర్థమవుతుందని అన్నారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశం నిర్వహించారు.

“దేశంలో రోజురోజుకూ ఆధ్యాత్మికత పెరుగుతోందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అయోధ్య(Ayodhya)కు రావడం లేదని చెప్పడం రాజకీయ దృక్పథంతో తీసుకున్న నిర్ణయమని అన్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఏనాడూ జాతీయ దృక్పథంతో వ్యవహరించలేదని విమర్శలు చేశారు. రామ మందిరం(Ayodhya Ram Mandir) ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంటే కాంగ్రెస్కు కంటగింపుగా ఉందని ఆరోపించారు. సరయూ నదిలో ప్రాణాలు కోల్పోయిన అమరుల ఆత్మలకు 22న శాంతి చేకూరుతోందన్నారు.

“Ayodhya Ram Mandir : రాముని ఉనికినే కొట్టేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, ఈ పార్టీకి బహిష్కరించడం అలవాటైపోయిందని బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి ఆరోపణలు చేశారు. జీ20(G 20), పార్లమెంటు, అఖిల పక్షం, ఎన్నికల కమిషన్ సమావేశాలను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభద్రతా భావంతో సహాయ నిరాకరణ చేస్తోందని, భారతదేశ సంస్కృతి సంప్రదాయాలంటే ఆ పార్టీకి గౌరవం లేదని ధ్వజమెత్తారు. జీఎస్టీ ఏర్పాటు చేస్తే గబ్బర్ సింగ్ ట్యాక్స్నని విమర్శించిందన్నారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) విదేశాల్లో భారతదేశ సౌభ్రాతృత్వాన్ని దెబ్బ తీస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు.

“కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యం తర్వాత హిందూ వ్యతిరేక ధోరణి ఏ రకంగా అవలంభిస్తోందో మరోసారి స్పష్టమైంది. జనవరి 22వ తేదీన జరిగే కార్యక్రమం ప్రపంచంలో ఉండే హిందువులకు ఎంతో ఉద్వేగభవితమైన కార్యక్రమం. ఒక న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా వాస్తవాలను అనుగుణంగా ఈరోజు ఆలయ నిర్మాణం జరిగి బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీకి కంటనింపుగా ఉంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఆడిపోసుకుంటుంది.” – కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు..

హిందువులకు సంబంధించిన ప్రతి అంశాన్ని కాంగ్రెస్ రాజకీయం చేయడమే ఆనవాయితీగా పెట్టుకుందని ఎంపీ కిషన్రెడ్డి దుయ్యబట్టారు. సనాతన ధర్మం అంటే కరోనా, క్యాన్సర్తో పోల్చి దిగజారి మాట్లాడుతున్నారన్నారు. అయోధ్య నుంచి వచ్చిన పూజిత అక్షింతలు పంపిణీ చేస్తుంటే రాష్ట్ర పోలీసులు అడ్డుకుని కేసులు బుక్ చేస్తున్నారని వాపోయారు. దేశంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదని, కేవలం ఒక్క హైదరాబాద్లోనే ఈ దుస్థితి వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ మెప్పు పొందేందుకే అక్షింతలు పంపిణీ చేసిన వాళ్లపై కేసులు పెట్టిందన్నారు..


TEJA NEWS