TEJA NEWS

నా మొదటి ఓటు చంద్రబాబుకే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన టిడిపి నేతలు…

నా మొదటి ఓటు అభివృద్ధికె నా మొదటి ఓటు చంద్రబాబుకే అనే ప్రచార కార్యక్రమాన్ని జంగారెడ్డిగూడెం లోని 5వ వార్డు కౌన్సిలర్ కరుటూరి రమాదేవి ఇంటి వద్ద టిడిపి సీనియర్ నేత మండవ లక్ష్మణరావు, నంబురి రామచంద్రరాజు, పరిమి సత్తిపండు, చిట్టిబొయిన రామలింగేశ్వరరావు, సాయిల సత్యనారాయణలతో కలిసి టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు ప్రారంభించారు.

ఈ సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించారు ఈసందర్భంగా మండవ లక్ష్మణరావు, పరిమి సత్తిపండు మాట్లాడుతూ మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే ప్రచార కార్యక్రమాన్ని నియోజకవర్గ పరిధిలోని ఉన్న కొత్తగా నమోదు అయిన యువ ఓటర్ల వద్దకు తీసుకువెళ్తారని, గతంలో జరిగిన అభివృద్ధి ప్రస్తుత ప్రభుత్వ హయాంలో జరుగుతున్న పరిస్థితిపై పార్టీకి చెందిన యువనేతలు వారియర్స్ తెలియజేస్తూ రిజిస్ట్రేషన్ చేస్తారని తెలిపారు.

సాయిల సత్యనారాయణ కరుటూరి రమాదేవి, పగడం సౌభాగ్యవతి లు మాట్లాడుతూ గత చంద్రబాబు నాయుడు పాలనా కాలంలో యువతకు అనేక కార్యక్రమాలు నిర్వహించారు అనేక కంపెనీలు తెచ్చి ఉద్యోగ భద్రత కల్పిచారని ప్రస్తుతం అవేవి లేవని అన్నారు.

ఈ కార్యక్రమానికి పార్లమెంటు కోర్దినేటర్ గా వ్యవహరిస్తున్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు మాట్లాడుతూ పార్లమెంట్ పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో ఉన్న యువ ఓటర్లను మొదటిసారి ఓటు హక్కు వినియోగించే యువతను తెలుగుదేశం పార్టీకి ఓటు వేసే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నామని గతంలో చంద్రబాబు నాయుడు పాలనా కాలంలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి పాలనా వైఫల్యాలను ప్రత్యేకంగా ప్రచారం చేయడంతో పాటు ఓటు యొక్క ప్రాముఖ్యతపై కూడా వారితో ముఖాముఖి నిర్వహిస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా సూర్యా కళాశాలలో విద్యార్థులకు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యత అనే అంశంపై విద్యార్థులతో కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కంపా రాజేంద్ర, యువత అధ్యక్షుడు కోనేటి చంటి, అలాగే ఈ కార్యక్రమ వారియర్స్, గెడా సుబ్రహ్మణ్యం, తాళ్లూరి వెంకటేశ్వరరావు, మన్యం దుర్గారావు, పోలవరం యువ నాయకుడు బొబ్బర రాజు, గోలి అనిల్, లాగు రాజ్ కుమార్, అయ్యప్ప, పులపాకుల విజయ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS