TEJA NEWS

పిల్లల తల్లిదండ్రులకు స్కూల్ యాజమాన్యానికి నాదొక మనవి

పిల్లల భవిషత్తు కోసం మీ ఆరాటన్ని అర్ధం చేసుకుందాం
నా పిల్లలు అన్ని మార్కులు తెచ్చుకోవాలి ఇన్ని మార్కులు తెచ్చుకోవాలి అని ఇటు తల్లిదండ్రులు మా స్కూల్ కి మంచిపేరు రావాలి అని
అటు స్కూల్ యాజమాన్యం వారిని ఇబ్బంది పెడితే వాళ్లకు ఏమి చేయాలో తెలియక జీవితం గురించి తెలిసి తెలియని వయసులో ఆత్మహత్య చేసుకుని చనిపోతే తిరిగి వస్తారా.? చెప్పండి

నెల్లూరులో జరిగిన ఘటన అబ్బాయి సూసైడ్ నోటు రాసి చనిపోయాడు

అమ్మ చదవలేక చనిపోతున్నా..! పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

అమ్మా నన్ను క్షమించు.. అంటూ తల్లికి లేఖ నెల్లూరులోని ఓ ప్రైవేటు స్కూల్లో ఘటన కేసు నమోదు.. విద్యాశాఖ అధికారుల ఆరా

నెల్లూరు రూరల్, ‘అమ్మా.. నన్ను క్షమించు. నేను చదవలేకపోతున్నా. నేను ఉన్నా ఒకటే, చనిపోయినా ఒకటే.. నంటూ నెల్లూరులో ఓ విద్యార్థి తన తల్లికి లేఖరాసి బలవన్మ రణానికి పాల్పడ్డాడు. నెల్లూరు రూరల్ మండలం ధనలక్ష్మీపురం వద్ద ఓ ప్రైవేటు స్కూల్లో చదువు తున్న విద్యార్థి దువ్వూరు పణత్ బుధవారం హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్కూలు సిబ్బంది ఒత్తిడివల్లే తమ బిడ్డ చనిపోయా డంటూ మృతుడి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళ నకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నెల్లూరు రూరల్ పోలీసుల కథనం మేరకు.. ముత్తుకూరులోని

ఆర్ఆర్ కాలనీకి చెందిన దువ్వూరు హరినాథ్డ్డి, అనితల పెద్ద కుమారుడు పణత్ ధనలక్ష్మీపురంలోని వీబీఆర్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం భోజనానికి వచ్చిన పణత్ తిరిగి తరగతి గదికి కాకుండా హాస్టల్ గదికి వెళ్లాడు. అక్కడే ఫ్యానుకు తాడుతో ఉరివేసుకుని బలవన్మర ణానికి పాల్పడ్డాడు. విద్యార్థి క్లాసుకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది గదిలో చూడగా తాడుకు పణత్ వేలాడుతూ కనిపించాడు. దీంతో అతడిని కిందికి దించి హుటాహుటిన సమీపంలోని నారాయణ హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే పణ త్ మరణించాడని వైద్యులు నిర్ధారించారు. ఈ విష యాన్ని స్కూల్ యాజమాన్యం ముత్తుకూరులోని పణత్ తల్లిదండ్రులకు చేరవేసింది. వారంతా హాస్పి టలకు చేరుకుని విగతజీవిగా పడిఉన్న పణతన్ను చూసి బోరున విలపించారు. అక్కడి నుంచి మృతదే హాన్ని వీబీఆర్ స్కూల్కు తరలించా రు. విద్యార్థి కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు,

పణత్ ఆత్మహత్య ఘటనపై అతడి తల్లిదండ్రులు, బంధువులు స్కూల్ యాజమాన్యంపై ఆగ్రహం. వ్యక్తం చేశారు. తనబిడ్డ చదువులో వెనకబడ్డాడని, ఒత్తిడి తీసుకురావద్దని పదేపదే చెప్పామంటూ మృతుడి తల్లి అనిత అన్నారు. పది వరకైనా చదివిం చాలన్న ఉద్దేశంతోనే స్కూల్లో చేర్చామని, మీ ఒత్తిడి వల్లో తన బిడ్డ తమకు కాకుండాపోయాడంటూ కన్నీటిపర్యంతమయ్యారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నెల్లూరు రూరల్ సీఐ జి. వేణు కేసు నమోదు చేసి మృతదేహాన్ని జీజీహెచ్కు తరలించారు. కాగా ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు వీబీఆర్ స్కూల్ వద్దకు చేరుకుని విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలను ఆరాతీశారు


TEJA NEWS