TEJA NEWS

నక్కపల్లి 50 పడకల ఆసుపత్రిలో షిప్ ట్రాయజన్ ఇంజక్షన్ వికటించి 17 మంది అశ్వస్థత

అనకాపల్లి జిల్లా : రాత్రి డ్యూటీ డాక్టర్ జయలక్ష్మి ఈ ఇంజక్షన్ లు చేసినట్లు తెలిపారు.

గత నాలుగు రోజులుగా ఇన్ పేషేంట్ లు ఉన్నారని వారికి రెగ్యులర్ గా ట్రీట్మెంట్ జరుగుతుందని పేర్కొన్నారు.

ఈ ట్రీట్మెంట్ లో భాగంగా ఇంజెక్షన్ ఇవ్వడం జరిగిందన్నారు.

పేషేంట్ లకు రియాక్షన్ వచ్చిన వెంటనే అంబులెన్స్ లో అస్వస్థతకు గురైన 17 మందిని అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తర్పించడం జరిగిందని తెలిపారు.

అనకాపల్లి తరలించిన పేషేంట్లు అందరూ పరిస్థితి బాగానే ఉందన్నారు.

ఈ విషయం తెలుసుకున్న నర్సీపట్నం ఇంచార్జి డ్రగ్ ఇన్స్పెక్టర్ కల్యాణి సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ పేసేంట్లు అస్వస్థతకు గురి కావడానికి కారణాలు తెలుసుకోవడం జరుగుతుందన్నారు.

పేషేంట్ల కు ఇచ్చిన ఇంజక్షన్ కు వ్యాలీడిటీ ఉందన్నారు.సిరైన్ కూడా పరిశీలించడం జరిగిందన్నారు. ఈ నివేదికను ఉన్నతాధికారుల కు తెలియజేస్తామని మెడిషన్ తయారీ లో తప్పు జరిగినట్లు తెలిస్తే వారిపై చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఒక వేళ వైద్యుల నిర్లక్ష్యంగా ఉన్నట్లు గుర్తిస్తే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

నక్కపల్లి 50 పడకల ఆసుపత్రిలో షిప్ ట్రాయజన్ ఇంజక్షన్ వికటించి

TEJA NEWS