TEJA NEWS

టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో నర్సారెడ్డి భూపతి రెడ్డి భేటీ

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,ఎమ్మెల్సీ మ‌హేష్‌ కుమార్‌ గౌడ్‌ను టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి మర్యాదపూర్వకంగా క‌లిశారు.
నర్సారెడ్డి భూపతి రెడ్డి తో పాటు మేడ్చ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఇన్‌ఛార్జీ వజ్రేష్ యాద‌వ్‌ , ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మందముల పరమేశ్వర్ ‌రెడ్డి మ‌హేష్‌కుమార్‌ గౌడ్ ని వారి నివాసంలో మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిసి ప‌లు విష‌యాల‌ను చ‌ర్చించ‌డం జ‌రిగింది.