చైనా ముందే కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు.

Spread the love

వాషింగ్టన్‌: చైనా (China) అంతరిక్ష కార్యక్రమాలపై అమెరికా స్పేస్‌ ఏజెన్సీ నాసా (NASA) అధిపతి బిల్‌ నెల్సన్ అనుమానాలు వ్యక్తం చేశారు. డ్రాగన్‌ తన అంతరిక్ష కార్యక్రమాలను రహస్యంగా ఉంచుతోందని, అక్కడ తన సైనిక ఆపరేషన్లను దాచిపెడుతోందని చట్టసభ సభ్యులకు వెల్లడించారు. 

‘‘దశాబ్దకాలంగా ఈ రంగంలో చైనా అసాధారణ ప్రగతి సాధించింది. అదంతా ఎంతో రహస్యంగా సాగింది. పౌర కార్యక్రమాల ముసుగులో మిలిటరీ ప్రాజెక్టులను చేపట్టిందని భావిస్తున్నాం. అయితే అమెరికా కూడా దీటుగానే ఈ రేసులో ఉన్నది. చంద్రుడిపైకి వెళ్లడం ప్రస్తుతం మాపై ఉన్న బాధ్యత. చైనా అక్కడకు ముందుగానే వెళ్తే2 Full stopఇది మా ప్రదేశం, మీకు స్థానం లేదనే అవకాశం ఉంది. ఈ రంగంలో దూసుకెళ్లేందుకు చైనా బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చేస్తోందని మనం గమనించాలి. అన్నింటికి సిద్ధంగా ఉండటం మంచిదని భావిస్తున్నా’’ అని కాంగ్రెస్‌కు వెల్లడించారు.

2025 ఏడాదికి నాసా బడ్జెట్‌ కేటాయింపుల అంశంలో భాగంగా అమెరికా ప్రతినిధుల సభకు చెందిన కమిటీ ముందు ఆయన హాజరయ్యారు. దానిలో భాగంగానే తన ఆందోళనలను వెలిబుచ్చారు. ఇదిలాఉంటే2 Full stop చంద్రుడిపై శాశ్వత నివాసానికి పునాదులు వేసే ప్రయత్నాల్లో భాగంగా నాసా ఆర్టెమిస్ ప్రాజెక్టును చేపట్టింది. దీని ద్వారా సుమారు 50 ఏళ్ల తర్వాత జాబిల్లిపై మనిషిని పంపనుంది. ఇప్పటికే ఆర్టెమిస్-1 నింగిలోకి దూసుకెళ్లగా2 Full stop రానున్న రోజుల్లో ఆర్టెమిస్-2, 3లను ప్రయోగించనుంది.

Print Friendly, PDF & Email

You cannot copy content of this page