నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట ఏబీవీపీ ధర్నా
వనపర్తి :
ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీల పై నూతన ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్యం పట్ల నిరసిస్తూ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు వనపర్తి ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలోజిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సందర్భంగా జిల్లా కన్వీనర్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు
కా వస్తున్న ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు. మెగా డీఎస్సీ వేస్తామని చెప్పి కేవలం 11వేల ఉద్యోగాలు వేయడం సిగ్గుచేటు, గ్రూప్ వన్ ప్రిలిమ్స్ 1:100 అభ్యర్థులను షార్ట్ లిస్టు చేస్తామని చెప్పి, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ను ఏర్పాటు చేస్తామని మాయమాటలు చెప్పి నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. గ్రూప్-2, గ్రూప్- 3 పోస్టులను పెంచాలని, రెండు లక్షల ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తానని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాలకృష్ణ, ఖేల్ కన్వీనర్ కేదార్నాథ్, రమ్య, కార్తీక్, హరికృష్ణ, అశ్వంత్ మరియు తదితరులు పాల్గొన్నారు.
నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…