TEJA NEWS

పాఠశాల విద్యార్థులకు నూతన చట్టాలు మరియు సైబర్ క్రైమ్స్, మూఢనమ్మకాలు ,బాల్య, వివాహాల పైన అవగాహన సదస్సు”

మహబూబాబాద్ జిల్లా కురవి ఏకలవ్య మోడల్ స్కూల్ లో చదువుతున్న బాల బాలబాలికలకు సామజిక అంశాలపై ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమానికి మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS గారు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
విద్యార్థులతో మమేకమైయ్యారు.
వారిని గోల్స్ అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. మహబూబాబాద్ జిల్లా పోలీస్ యంత్రాంగం ఎల్లపుడు అందుబాటులో ఉంటుందని అన్నారు…

నూతన చట్టాలు,షీ టీం గురించి వివరిస్తూ విద్యార్థులందరూ న్యూ క్రిమినల్ లా అండ్ సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని అపరిచిత వ్యక్తులతో ఫోన్ కాల్స్ గాని వాట్సాప్ కాల్ గాని మాట్లాడవద్దని అపరిచిత వ్యక్తులు కానీ అపరిచిత గ్రూపుల నుండి వచ్చినటువంటి అపరచిత లింకులను ప్రెస్ చేయవద్దని వివరిస్తూ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే 1930 అనే టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి సమస్యను పరిష్కరించుకోవాలని, దీనిలో భాగంగా మహిళలు ఆపద సమయంలో డయల్100,షీ టీమ్ నెంబరుకు సంప్రదించాలని .
ఆడవాళ్ళు ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు
ఏదైనా సమస్య వచ్చినపుడు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి T-SAFE APP ( Travel Safe) ను ప్రతి ఒక్క మహిళ ఉపయోగించుకోవాలని,
ఏదైనా సమస్య వచ్చినప్పుడు మౌనంగా భరించ కుండా ముందుకు వచ్చి షీ టీమ్ ని సంప్రదించి ,వారి సమస్యలను పరిష్కరించుకొవాలని తెలపడం జరిగినది.
ప్రత్యేకంగా చిన్న పిల్లలకు గుడ్ టచ్,బ్యాడ్‌ టచ్ మీద అవగాహన కల్పించాలని అవసరమైన ఆత్మ రక్షణ విద్యలను నేర్చుకోవాలి అని
సోషల్ మీడియా ను వాడుతున్న వారు వాటి పరిధి ని తెలుసు కోవాలని అపరిచిత వ్యక్తులతో మాట్లాడరాదని,
ఒక వేళ సోషల్ మీడియా లో హరాస్మెంట్,సైబర్ క్రైమ్ కు గురి అయితే తక్షణమే షీ టీమ్ కానీ,పోలీసులకు కానీ సంప్రదించాలని తెలియచేసారు.

షీ టీం ను సంప్రదించడానికి QR Code విధానాన్ని face book, Twitter, Instagram ఉపయోగించుకోవాలని,అలాగే సోషల్ మీడియా లో కూడా షీ టీం ను సంప్రదించవచ్చని తెలియచేయడం జరిగినది.
ఇంకా మానవ అక్రమ వివాహ రవాణా, ఉమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ క్యూఆర్ కోడ్ పిటిషన్ మరియు సైబర్ నేరాల అండ్ సైబర్ సెక్యూరిటీ సేవలు,1930, మరియు ఫోక్సో చట్టాల గురించి బాల్య గురించి 180మంది విద్యార్థినీలకు అవగాహన కల్పించడం ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా అమ్మాయిలు వివిధ గ్రామాల నుండి వస్తుంటారు. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దని తమ వ్యక్తిగత విషయాలను వ్యక్తిగత ఫోటోలని సోషల్ మీడియాలో గాని, ఇతరులకు గాని షేర్ చేయొద్దని.. అట్టి ఫోటోలను అడ్డుపెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉంటుంది, కావున తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఒకవేళ ఎవరైనా అలా బ్లాక్మెయిల్ చేసినట్లయితే పరువు పోతుందని భయపడకుండా షీ టీమ్ ని సంప్రదించాలని… షీ టీం కి కంప్లైంట్ చేసినట్లయితే కంప్లైంట్ యొక్క వివరాలు గొప్యం గా ఉంచబడతాయని, బాధితురాలు షీ టీమ్ ఆఫీస్ కి రాలేని పక్షంలో షీ టీం సభ్యులే వారి దగ్గరికి వెళ్తారని కావున ఎలాంటి భయం లేకుండా కంప్లైంట్ చేయాలని, షీ టీమ్ వాట్స్ అప్ నంబర్స్ 8712656935, 7901142009 కి తెలియచేసిన చో తగిన చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతి రావు, రూరల్ సీఐ శరవయ్య, కురవి ఎస్.ఐ గోపి, స్కూల్ ఇంచార్జి ప్రిన్సిపాల్ జ్యోతి, టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS