బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నిజాంపేట్ కార్పొరేషన్ గణనీయమైన అభివృద్ధి సాధించింది : డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్….
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిజాంపేట్ 29 & 27వ డివిజన్ లో శ్రీ రామ్ కుంట పార్క్ & బండారి లేఔట్ లో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, ఎన్ఎంసి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, కార్పొరేటర్లు బొర్రా దేవి చందు ముదిరాజ్, జ్యోతి నర్సింహా రెడ్డి, పైడి మాధవి, సుజాత, రఘూవేంద్ర రావు, బాలాజీ నాయక్, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్నింగ్ వాకర్స్ & ఇంటింటి ప్రచారంలో పాల్గొని బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి ఎంపి అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ని మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రవి కాంత్, నర్సింహా రెడ్డి, బొర్రా చందు, చంద్రగిరి సతీష్,ఎన్ఎంసి మహిళా అధ్యక్షురాలు అర్ఫిత ప్రకాష్, నాయకులు గోపాల్ కృష్ణ ముదిరాజ్, స్వామి, దశరథ్, అజయ్ చౌదరి, అనిల్,దూసకంటి వెంకటేష్, డివిజన్ అధ్యక్షులు బొబ్బా శ్రీనివాస్, ఆవుల ఎల్లయ్య, స్టాలిన్ రెడ్డి, నర్సింహా రాజు ,మధుసూదన్ , ప్రవీణ్, డివిజన్ మహిళా అధ్యక్షురాలు కృష్ణ మంజరి ,సంధ్య రాణి, మహిళా నాయకులు కల్పనా, రోజా,రాణి,సరస్వతి, మంజుల, యువకులు ప్రవీణ్, ఉమా శంకర్, సన్నీ, మార్నింగ్ వాకర్, అసోసియేషన్ సభ్యులు, స్థానికులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.