బాపట్ల జిల్లా ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు
సంక్రాంతి పండుగ ముసుగులో కోడి పందాలు, గుండాట, జూదము నిర్వహించుట నిషేధం
అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము
జూద క్రీడలు వద్దు సంప్రదాయ క్రీడలు ముద్దు
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్
బాపట్ల జిల్లా ప్రజలందరికీ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాల మేళవింపుతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి జరుపుకునే సంక్రాంతి నూతన వెలుగులను, సంతోషాలను నింపాలని ఎస్పీ ఆకాక్షించారు. సంక్రాంతి పండుగ ముసుగులో కోడి పందాలు, గుండాట, జూదము నిర్వహించుట నిషేధమని, ఎటువంటి జూద క్రీడలు నిర్వహించవద్దని, గతంలో కోడిపందాలు నిర్వహించిన, ఆడిన వారిపై బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. జిల్లాలో గతంలో కోడిపందాలు నిర్వహించిన ప్రాంతాలలో, అనుమానిత ప్రదేశాలలో గస్తీ నిర్వహిస్తున్నామని, ఇప్పటికే ప్రభావిత గ్రామాలలో పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమించి కోడి పందాలు, గుండాట, జూదము కోడి పందాలలో పాల్గొన్నా, నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.