TEJA NEWS

కాళేశ్వరం ఈఎన్సీకి నోటీసు

మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి పరస్పర విరుద్ధ ధ్రువీకరణలు ఎందుకు ఇచ్చారో వివరణ తెలపాలంటూ కాళేశ్వరం ఎత్తిపోతల ఇంజినీర్ ఇన్ చీఫ్‌కు నీటిపారుదల శాఖ నోటీసు జారీ చేసింది.

బ్యారేజీ నిర్మాణంలో లోపాలకు, పని పూర్తికాకుండానే పూర్తయినట్లు నివేదించి తమను తప్పుదోవ పట్టించడానికి బాధ్యులెవరో తేల్చి.. వివరాలు పంపాలని నీటిపారుదల శాఖ ఈఎన్సీ(జనరల్‌) మురళీధర్‌ ఈ నోటీసు ఇచ్చారు.


TEJA NEWS