TEJA NEWS

ఎన్టీఆర్ భరోసా సామజిక పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న మాజీ మంత్రి మరియు వేమూరు శాసన సభ్యులు నక్కా ఆనంద బాబు .

అమర్తలూరు మండలంలోని కూచిపూడి గ్రామం వేమూరు మండలం లోని పెరవలిపాలెం గ్రామంలో ఉదయం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన గ్రామంలోని టీడీపీ నేతలతో కలిసి ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ నగదును పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, టీడీపీ జనసేన,కూటమి నేతలు పాల్గొన్నారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెరిగిన పెన్షన్లను వేమూరు నియోజకవర్గం అమర్తలూరు మండలం కూచిపూడి, వేమూరు మండలం పెరవలి పాలెం గ్రామం లో వికలాంగులకు 6000 వృద్ధులకు 4000 పంపిణీ చేసిన నక్కా ఆనందబాబు

మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు మాట్లాడుతూ

అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నుంచి మూడు నెలలది పోయిన నెల కలిపి గత నెలలో 7000 ఇచ్చాం ఈనెల నుంచి 4000 పెన్షన్ ఇస్తున్నామన్నారు

జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇచ్చిన 2000 పెన్షన్ దగ్గర నుంచి పెంచుకుంటూ పోతానని 250 చొప్పున ఐదు సంవత్సరాలుకి వెయ్యి రూపాయలు పెంచాడు

చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే పెరిగిన 4000 పెన్షన్ అమలు చేశారు

జగన్మోహన్ రెడ్డి వాళ్ల నాయకులు రాష్ట్రాన్ని భ్రష్ట పట్టించారు

జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు దోపిడీ చేశారు తవ్వినకొద్దీ బయటకు వస్తున్నాయి వీటన్నిటిపై విచారణ జరిపిస్తాం

గ్రామస్థాయిలో కూడా అవినీతి జరిగింది ఎవరెవరు అవినీతి చేశారు అరాచకాలు చేశారో వాళ్లందరికీ భరతం పడతాం

రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది

రాష్ట్రంలో పారదర్శకమైన ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తాం

చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రజలు బ్రహ్మాండమైన మాండేటరీ ఇచ్చారు దేశంలోనే ఎప్పుడు లేనటువంటి విధంగా 164 సీట్లు ఇచ్చారు దాన్ని మేం బాధ్యతగా తీసుకొని పనిచేస్తామన్నారు

జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ అంటే అధికారం ఇచ్చారు ఆ అరాచకాన్ని చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు కావాలని రాష్ట్ర ప్రజలు ఏమీ ఆశించకుండా ఓట్లు వేసి కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చారు

రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని ఓమ్ము కానీ ఇవ్వకుండా రాష్ట్రంలో ఉన్న రాక్షసులను బంగాళాఖాతంలో తొక్కేసి మీకు మంచి పాలన అందిస్తామన్నారు…


TEJA NEWS