TEJA NEWS

మరోసారి పెద్ద ఎత్తున గంజాయి చాక్లెట్ గుట్టు రట్టు చేసిన సైబరాబాద్ SOT బాలానగర్ టీం

విశ్వసనీయ సమాచారం మేరకు SOT బాలానగర్ టీమ్ మరియు జగత్గిరిగుట్ట పోలీసులు సంయుక్తంగా జగత్గిరిగుట్ట రింగ్ బస్తీలో కిరాణా దుకాణంపై దాడి చేసి దుకాణం యజమాని బీహార్ కు చెందిన సునీల్ కుమార్ ఝా ను అదుపులోకి తీసుకుని 61 ప్యాకెట్ల లో ఉన్న 2400 (13 కేజీల) గంజాయి చాక్లెట్ల ను స్వాదీనం చేసుకున్నారు.

  • పట్టుబడ్డ సునీల్ కుమార్ ఝా 20 సంవత్సరాల క్రితం కూలీ పనుల కోసం బీహార్ నుండి వలస వచ్చినట్లు తెలుస్తుంది.
  • గంజాయి చాక్లెట్ల ను బీహార్ నుండి తెస్తున్నట్లు తెలుస్తుంది.
  • కొన్నేళ్ల క్రితం కిరాణా షాప్‌ని ప్రారంభించాడు.
  • ఒక్కోచాక్లెట్ రూ.40/- లకు వలస కార్మికులకు అమ్ముతునట్లు తెలుస్తుంది.
  • వీటి మొత్తం ధర రూ. 97,600/-

జగత్‌గిరి గుట్ట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


TEJA NEWS