ఒక్కొక్కటిగా బయటపడుతున్న యూనియన్ బ్యాంక్ మేనేజర్ ప్రభావతి అక్రమ బాగోతాలు

TEJA NEWS

కృష్ణాజిల్లా
పెనమలూరు నియోజకవర్గం

పెనమలూరు మండలం గంగురు లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో మేనేజర్ గా పని చేస్తున్న దావులూరి ప్రభావతి అదే బ్యాంకులో బంగారం కుదవ పెట్టిన కౌలూరి యోగేశ్వరరావు అనే ఖాతాదారుడు కి చెందిన 380 గ్రాముల బంగారాన్ని ఫోర్జరీ సంతకంతో స్వాహా చేయడంతో యోగేశ్వరరావు పోలీసుల ఆశ్రయించగా పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సంగతి అందరికీ విదతమే.

ఈ కేసు నమోదు అయిన తర్వాత యూనియన్ బ్యాంక్ అధికారులు విచారణ జరిపి ప్రభావతి అక్రమానికి పాల్పడినట్లు నిర్ధారణకి వచ్చి ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది.

ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రభావతి పరారీలో ఉంది.

అయితే ప్రభావతి చేసిన అనేక అక్రమాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి.

నూజివీడు మండలం మర్రిబంధం గ్రామానికి చెందిన సొంత బాబాయ్ పిన్ని లకు చెందిన ఇంటిని సైతం ఫోర్జరీ సంతకంతో వీలునామా తయారుచేసి దానిని రిజిస్ట్రేషన్ చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలియ వచ్చింది.

ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెద్ద కడిమి గ్రామంలో ప్రభావతి బాబాయి అయినా మండవ వెంకట నాగ వరప్రసాద్ కు చెందిన ఇంటిని ఫోర్జరీ సంతకాలతో తన పేరు మీద మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వరప్రసాద్ మీడియాకు తెలిపారు.

ప్రభావతి తన తల్లిని చివర దశలో పట్టించుకోకపోవడంతో తాము ఆమెకు పరిచర్యలు చేసి కర్మకాండలు సైతం తామే నిర్వహించామని ఆమె అనారోగ్యంతో ఉండగా ఆమెను ఆదరించామని కృతజ్ఞతతో పెద్దకడిమిలోని 303 చదరపు గజాల నివాస స్థలాన్ని అందులో నిర్మించిన ఇంటిని తమకు చెందే విధంగా వీలునామా రాసిందని.

ఆమె చనిపోయే వరకు ఏమీ మాట్లాడని ప్రభావతి ఆమె చనిపోయిన తరువాత తన పేరుతో ఆ స్థలము ఇల్లు రాసినట్లు ఫోర్జరీ సంతకంతో వీలునామాను సృష్టించి తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు బాబాయి పిన్నులు ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామ సర్పంచి తో పాటు పెద్దమనుషుల క్షమాక్షంలో తమకు వీలునామా రాశారని వారందరూ సాక్ష్యం చెబుతామని ముందుకు వచ్చారని ఈ విషయాన్ని నూజివీడు పోలీసులను ఆశ్రయించి న్యాయం కోరామని వారు తెలిపారు.

మూడు సంవత్సరాలుగా ఈ విషయంలో న్యాయపోరాటం చేస్తూనే ఉన్నామని మీడియాలో ప్రభావతి యుద్ధాంతం చూసిన తర్వాత తాము కూడా మీడియా ముందుకు వచ్చి తమ బాధను వెళ్ళగక్కామని వారు తెలిపారు.

ప్రభావతి బాధితుడైన యోగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ యూనియన్ బ్యాంక్ వారు ప్రభావతి అక్రమాన్ని నిర్ధారించి తనకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని అయినా ప్రభావతి తండ్రి తన పైన లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని నేను వారి వద్ద అప్పుకు వెళ్లానని అనటం హాస్యాస్పదంగా ఉంది. నా ఆర్థిక స్థితి గతుల గురించి అందరికీ తెలుసునని నేను వారి వద్దకు అప్పుకు వెళ్ళవలసిన అవసరం లేదని పోలీసులు ఈ విషయంలో త్వరగా దర్యాప్తు చేసి ప్రభావతిని అరెస్టు చేసి విచారణ చేసి తనకు తగు న్యాయం చేయాలని యోగేశ్వరరావు కోరారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS

You cannot copy content of this page