TEJA NEWS

మంథని పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం

పెద్దపల్లి జిల్లా:
పెద్దపల్లి జిల్లా మంథని
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం లో భాగంగా గురువారం మంథని పోలీస్ స్టేషన్ యందు ఓపెన్ హౌస్ కార్యక్రమం ఏసీపి మడత రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 303 తుపాకి నుండి ఎల్ ఏం జి గన్ వరకు నైట్ విజన్ కమ్యూనికేషన్,మొదలగు వాటిని ఎలా ఉపయోగిస్తా రో విద్యార్థులకు క్షుణ్నంగా వివరించారు.

జిల్లాలో అమరవీరుల సంస్కరణ దినోత్సవం లు ఈ నెల 21నుండి సంస్కరణ దినములు నిర్వహిస్తున్నామన్నారు.ఇందులో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహించాడం జరిగింది అన్నారు.

ఈ కార్యక్రమంలో మంథిని సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, తోపాటు పోలీసు సిబ్బంది, విద్యార్థి విద్యార్థునులు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS