TEJA NEWS

శంషాబాద్ ఎయిర్‌పోర్టు రన్‌వేపై చిరుత కలకలం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎయిర్‌పోర్టు పరిసరాల్లో హై అలర్ట్ ప్రకటించారు.

చిరుతను బంధించేందుకు మొత్తం 9 ట్రాప్ కెమెరాలతో పాటుగా ఒక బోన్‌ను సైతం ఏర్పాటు చేశారు. అయితే ఆ ట్రాప్ కెమెరాల్లో సైతం చిరుత కదలికలు స్పష్టంగా రికార్ట్ అయ్యాయి.

అదే చిరుత రన్‌వే పైకి వచ్చిందని జిల్లా అటవీ శాఖ అధికారి విజయానంద్ తెలిపారు. కొన్ని నెలల క్రితం షాద్‌నగర్ ప్రాంతంలోనూ చిరుత కనిపించింది.

ఇప్పుడే అదే చిరుత ఎయిర్‌పోర్టు పరిసరాలకు వచ్చి ఉంటుందని ఎయిర్‌ పోర్టు అధికారులు భావిస్తు న్నారు. చిరుతను బంధిం చేందుకు అందులో ఓ మేకను సైతం ఎరగా ఉంచినట్లుగా డీఎఫ్‌వో విజయానంద్ వెల్లడిం చారు…


TEJA NEWS