TEJA NEWS

నూతన వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది : ఎమెల్సీ శంభీపూర్ రాజు …

దుండిగల్ గండిమైసమ్మ మున్సిపాలిటీ పరిధిలోని డి పోచంపల్లిలోని సురక్ష గ్రీన్ మెడోస్ కల్చరల్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు శంభీపూర్ కార్యాలయంలో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమెల్సీ శంభీపూర్ రాజు ని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.

ఈ సంధర్బంగా ఎమెల్సీ శంభీపూర్ రాజు మాట్లాడుతూ అసోసియేషన్ సభ్యులంతా ఐకమత్యంగా ఉంటూ అసోసియేషన్ అభివృద్ధికి కృషిచేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో సురక్ష గ్రీన్ మెడోస్ కల్చరల్ అసోసియేషన్ నూతన కమిటీ అధ్యక్షులు వేణు గౌడ్, జనరల్ సెక్రెటరీ శ్రీరాములు, ఉప అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ హేమంత్ రెడ్డి, సుధాకర్ గౌడ్, సాంబశివ రావు, అమర్నాథ్, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS