TEJA NEWS

మధ్యాహ్నం భోజనం తనిఖీ చేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసి, మధ్యాహ్నం భోజనం మెనూ ను పరిశీలించి, విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం వడ్డించిన గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ
విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన ఆహారం అందించాలని ఎమ్మెల్యే గాంధీ సూచించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న మెను వివరాలు,ఉపాధ్యాయులను, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.వంటశాల లోని,బియ్యాన్ని,సరుకులను నాణ్యతను పరిశీలించారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రిన్సిపాల్ కు ,వంట సిబ్బందికి PAC చైర్మన్ గాంధీ తెలియజేశారు.

విద్యార్థులకు శుచి శుభ్రతతో కూడిన చక్కటి రుచికరమైన భోజనం అందించాలని విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలను తీసుకోవాలని , విద్యార్థులకు మంచి పౌష్టికాహారం తో కూడిన భోజనం తో పాటు మంచి విద్య ను అందించినప్పుడే వారికి ఉజ్వల భవిష్యత్తు ను ఇచ్చినవారం అవుతామని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు . మీకు అన్ని విధాలుగా అండగా ఉంటానని, ఏ చిన్న సమస్య వచ్చిన తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తామని, తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలో ఉంటాయి అని ,మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిఆరోహించాచాలని విద్యార్థులకు PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు,నాయకులు యాదగిరి గౌడ్, రవీందర్ యాదవ్ మరియు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS