కరీంనగర్‌లోని సుభాష్‌నగర్‌లో 50 పూరిళ్లు దగ్ధం పూరిళ్లలో పెద్దఎత్తున చెలరేగిన మంటలు మంటల ధాటికి ఇళ్లలోని 5 వంట గ్యాస్‌ సిలిండర్లు పేలుడు మంటలార్పేందుకు యత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది 20 ఏళ్లుగా పూరిళ్లలో ఉంటున్న కార్మికులు మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వెళ్లిన కార్మిక కుటుంబాలు ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రాణనష్టం

ఢిల్లీ చలో’ కు విరామం.. న్యూఢిల్లీ : కనీస మద్దతు ధర చట్టం, రుణమాఫీ తదితర రైతుల డిమాండ్లపై రైతు నేతలు, కేంద్ర మంత్రుల మధ్య జరిగిన నాలుగో దఫా చర్చలు ముగిశాయి. ముగ్గురు కేంద్ర మంత్రులు కమిటీ గతంలోనూ మూడుసార్లు రైతు సంఘాలతో చర్చించిన విషయం విదితమే. ఆదివారం రాత్రి 8 గంటల 15 నిముషాల నుండి సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట వరకు చర్చలు సాగాయి. ఈ చర్చల్లో కీలక ప్రతిపాదనను రైతు సంఘాల…

వైసీపీకి బిగ్ షాక్…! టిడిపిలోకి చేరనున్న ఇద్దరు ఎమ్మెల్యేలు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రెండ్రోజుల్లో ఆయన టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే అక్కడ ఇన్ఛార్జ్ తిరుపతి యాదవ్ను వైసీపీ నియమించింది. ఆలూరు ఎమ్మెల్యే జయరాం సైతం వైసీపీ అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న రాప్తాడులో సీఎం సభకు ఆయన రాలేదు. ఆలూరు ఇన్ఛార్జ్ వేరే వ్యక్తిని వైసీపీ నియమించింది. దీంతో ఆయన పార్టీ మారుతారనే…

ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కామెంట్స్ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి దేవాదాయ శాఖ భూమిలో రోడ్డు వేస్తే అధికారులు సైలెంట్ అయ్యారు. దేవాదాయ శాఖలో భూమిలో రోడ్డు వేసి స్వాహా చేయాలని ఎమ్మెల్యే రాచమల్లు చూస్తున్నాడు. ఎమ్మెల్యే సోదరుడు మైలవరం కాలువ భూమిని, బంజరు భూమిని ఆక్రమించాడు. చౌటపల్లె లో క్రిష్టియన్ల భూమిని దొంగ డాక్యుమెంట్లు తో ఎమ్మెల్యే రాచమల్లు స్వాహా చేశాడు. ప్రొద్దుటూరు లో అపార్టుమెంట్లు నిర్మాణలలో పిటిషన్లు పెట్టి వాళ్ళ దగ్గర ఎమ్మెల్యే…

మద్యం బాటిల్లను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన నగరంపాలెం పోలీసులు వివరాళ్లోకి వెళితే ఈ రోజు తెల్లవారుజామున సమయంలో నగరంపాలెం పి.యస్ యస్.ఐ గారైన బి. రవీంద్ర నాయక్ గారు వారి సిబ్బందితో కలిసి స్టేషన్ పరిధిలో పెట్రోలింగు నిర్వహిస్తూ చుట్టుగుంట వద్దకు చేరేసరికి అక్కడ ఒక వ్యక్తి రెండు నల్లటి బ్యాగులను బండి పై పెట్టుకుని పోలీసు వారిని చూసి పారిపోవుటకు ప్రయత్నించగా అంతట యస్.ఐ గారు వారి సిబ్బందితో కలిసి ఆ వ్యక్తిని…

అధిష్టానం ఆదేశిస్తే రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తా.. ఎక్కడి నుండైనా పోటీ చేసేందుకు సిద్ధం.. అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటా.. రాప్తాడు సిద్ధం సభ చూసిన తర్వాత వైసీపీ పట్ల ప్రజాభిమానం ఏ మాత్రం తగ్గలేదు.. రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయం- ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రభుత్వ సలహాదారు ఆలీ.

ఫిబ్రవరి నెల 20,21,22 మరియు 23 తేదీలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు. గత పదేళ్లుగా యెటువంటి ఆధార్ అప్డేట్ చేయని వారు ఇంకా ఆంద్రప్రదేశ్ లో 1.53 కోట్ల మంది ఉన్నారని అధికారులు వెల్లడించారు. వీరంతా గ్రామ మరియు వార్డ్ సచివాలయంలో అప్డేట్ చేసుకోవాలని అధికారులు తెలిపారు

కేంద్ర ప్రభుత్వం టాలీవుడ్ మెగాస్టార్‌ చిరంజీవికి ‘పద్మ విభూషణ్’ పురస్కారాన్ని ప్రకటించింది. ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా చిరంజీవి ఈ అవార్డును అందుకోనున్నారు. తాజాగా అమెరికాలోని మెగా ఫాన్స్ ‘మెగా ఫెలిసిటేషన్ ఈవెంట్’ను ఆదివారం లాస్ ఏంజిల్స్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవిని ఘనంగా సత్కరించారు. తనను సత్కరించిన అభిమానులకు మెగాస్టార్ ధన్యవాదాలు చెప్పారు..

ఏపీలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతుంది. ఏపీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలను వైఎస్ షర్మిల చేపట్టిన తర్వాత తొలిసారి తిరుపతి వేదికగా ఆ పార్టీ భారీ సభను ఏర్పాటు చేయనుంది. ఈ నెల 25న జరగబోయే బ‌హిరంగ స‌భలో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, సిద్దరామయ్యలు పాల్గొంటారని స‌మాచారం. ఈ సభ ద్వారానే ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ ప్రారంభించే అవకాశముంది.