పెద్ద ఎత్తున తరలి వచ్చి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు..మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్- కవిత దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.వివాహ వార్షికోత్సవం సంధర్బంగా నీలం మధు దంపతులు హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.నీలం మధు వివాహ వార్షికోత్సవం సంధర్బంగా మెదక్ పార్లమెంటు పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు,శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూల బొకేలు, శాలువలతో సత్కారం చేసి శుభాకాంక్షలు తెలిపారు.

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని రాం నరేష్ నగర్ రోడ్ నంబర్ 2, 3, 4, 5, లలో చేపట్టనున్న యూజీడి పైప్ లైన్ నిర్మాణ పనులను కాలనీ వాసులతో కలిసి ప్రారంభించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ* హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని రాం నరేష్ నగర్ లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, యూజీడీ వంటి అభివృద్ధి పనులను…

మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి మొన్న జరిగిన ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియాజకవర్గం లో బూత్ల వారీగా వోటింగ్ శాతం, వివిధ అంశాలపై చర్చించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి . ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ అన్ని డివిజన్ల అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రాహుల్ తో కలిసి ప్రత్యేక విమానం లో ఒరిస్సా వెళ్లనున్న భట్టి…. రాహుల్ తో కలిసి ఒరిస్సా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం భట్టి ఇప్పటికే మూడు విడతలుగా ఒరిస్సాలో ఎన్నికల ప్రచారం చేసిన భట్టి విక్రమార్క

వెస్ట్ నైల్ వైరస్‌‌తో వచ్చేదే.. వెస్ట్‌ నైల్ ఫీవర్వెస్ట్ నైల్ వైరస్‌తో ఇన్‌ఫెక్ట్ అయిన దోమ కుట్టినప్పుడు ఆ వ్యక్తికి వెస్ట్‌ నైల్ ఫీవర్ సోకుతుంది. ఈ వైరస్ సోకిన దోమల్ని తిన్న పక్షుల ద్వారా కూడా వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్‌కి పక్షులే ప్రైమరీ క్యారియర్స్ అని వైద్యులు చెబుతున్నారు. అయితే.. ఈ వ్యాధి సోకిన వాళ్లలో దాదాపు 80% మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. అవయవ మార్పిడి, రక్త మార్పిడి ద్వారానే…

పోలీసుల వాహనంపై నక్సలైట్ల దాడిఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా ఫర్సెగఢ్ సీఐ వాహనంపై మావోయిస్టులు దాడికి దిగారు. సీఐ ఆకాష్ ప్రభుత్వ పని మీద ఓ సైనికుడితో కలిసి బీజాపూర్ కు వస్తుండగా కుట్రు- ఫర్సెగఢ్ మధ్య దాడి చేశారు. ఈ దాడిలో సీఐ తృటిలో తప్పించుకున్నారు. దాడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

పీఓకేను త్వరలోనే వెనక్కి తీసుకుంటాం: అమిత్ షాపాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. దానిని పాకిస్థాన్ అడ్డుకోబోదని తెలిపారు. ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి జమ్మూకశ్మీర్‌లో శాంతి నెలకొందని, పీఓకేలో ఆజాదీ నినాదాలు వినపడుతున్నాయని తెలిపారు. పీఓకేలో హింసాత్మక పరిస్థితులు నెలకొన్న వేళ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్షం.

హైదరాబాద్:ఎన్నికల నేపథ్యంలో ఏపీ తెలంగాణలో మా నాయకుడిది గెలుపంటే… మా నాయకుడిదే విజయం అంటూ… పోటా పోటీ ప్రచారాలు ముగిసాయి. పోలింగ్‌కి ముందు పోటీ పడి ప్రచారాలు చేసిన నాయకుల అనుయా యులు… ఇప్పుడు మాదే గెలుపు… పందెమెంతో చెప్పు అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు. కూటమి, వైసీపీ నేతలపై బెట్టింగులు కాస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, చిత్తూరు జిల్లాలో బెట్టిం గులు జోరందుకున్నాయి. ఐపీఎల్ సీజన్‌లోనూ క్రికెట్‌ను తలదన్నేలా పొలిటికల్ బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. ఫలితాలకు ఇంకా 20 రోజుల…

తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేగింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్‌ రోడ్డులో చిరుత కనిపించింది. ఇవాళ తెల్లవారుజామున భక్తుల కారుకు అడ్డుగా వచ్చింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ నేప‌థ్యంలో భ‌క్తులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, కాలిన‌డ‌క‌న తిరుమ‌ల‌కు వెళ్లే మెట్ల మార్గంలో భ‌క్తులు గుంపులుగా వెళ్లాల‌ని అధికారులు సూచించారు.

పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా రోడ్డెక్కితే రూ.10 వేలు ఫైన్దేశంలో రోజురోజుకు వాహనాల కాలుష్యం పెరిగిపోతోంది.ఈ నేపథ్యంలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు పుణేకు చెందిన అధికారులు సరికొత్త పరికరాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా రోడ్డెక్కీ వాహనాలకు రూ.10 వేలు జరిమానా విధించేలా పెట్రోల్ పంపుల వద్ద అధునాతన కెమెరాలను ఉపయోగించి ఆటోమేటెడ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నారు. త్వరలోనే ఈ సిస్టమ్ అందుబాటులోకి రావొచ్చు.