రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ పార్టీ
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
తెలంగాణలో పరోక్ష పాలనకు ఆంధ్ర నాయకుల కుట్ర.
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చెప్పినట్టుగా పార్టీ మారిన ఎం.ఎల్. ఎ లతో రాజీనామా చేయించాలని డిమాండ్. సింగిరెడ్డి.నిరంజన్ రెడి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి.
రాష్ట్ర బి.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడారు.ఈసందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ కి బహిరంగ లేఖ రాశారు, నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ 2014నుండి 2018వరకు అధికారంలో ఉన్నప్పుడు ఇరు రాష్ట్రాల విభజన చట్టాలలోని అంశాలు పరిష్కారానికి చొరవ చూపని చంద్రబాబు నేడు శిష్యుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే విభజన అంశాలు గుర్తుకు వచ్చి తెలంగాణ రావడం వెనుక కుట్ర వుందని పరోక్షంగా తెలంగాణ పాలించడానికి వేస్తున్న అడుగులు అని తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు సమస్యల కోసం వస్తున్న చంద్రబాబుకు పెద్ద యెత్తున తోరణాలు ఫ్లెక్సీలు కట్టి స్వాగతం పలకడంతో మరోసారి తెలంగాణను కబలించడానికి అని అన్నారు.