TEJA NEWS

వెన్నుపోటు, గొడ్డలివేటు పేటెంట్… జగన్ రెడ్డిదే!
** టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్

చిత్తూరు: కన్నతల్లి, సొంత చెల్లితో పాటు చిన్నాన్న కుటుంబానికి వెన్నుపోటుతో గొడ్డలివేటు చేసిన పేటెంట్… జగన్ రెడ్డిదే అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్ ఆరోపించారు. ఆయన జిల్లా టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కుంభకోణాల నుంచి ప్రజా దృష్టి మళ్లించడానికే జగన్ ముఠా ధర్నాల డ్రామా ఆడుతున్నదని విమర్శించ్చారు.
ఏ ప్రభుత్వం చేయని విధంగా తొలి ఏడాదిలోనే 70శాతం హామీలు అమలు చేసిన ఘనత తమ కూటమి ప్రభుత్వంకే దక్కిందన్నారు.
గత ఐదేళ్ళలో 85 శాతం హామీలకు ఎగనామం పెట్టిన జగన్ సర్కార్….బీసీ సామాజిక వర్గానికి చెందిన జింకా వెంకట నరసయ్య తన బెరైటీస్ మైన్లో జగన్ తాత రాజారెడ్డికి కొంత భాగస్వామ్యం కల్పిస్తే కృతజ్ఞత లేకుండా మైన్ ఓనర్ ని హత్య చేసి ఆ మైన్ ను రాజారెడ్డి కబ్జా చేసాడని ఆరోపించారు. బీసీలకు వెన్నుపోటుతోనే జగన్ కుటుంబం బెరైటీస్ గని యజమాని అయ్యారని తెలిపారు. కాంగ్రెస్ ను అడ్డం పెట్టుకుని రూ.లక్షల కోట్లు దోచుకుని, అదే పార్టీకి వెన్నుపోటు పొడిచి వైసీపీని స్థాపించిన జగన్ రెడ్డి వెన్నుపోటు గురించి మాట్లాడడం సిగ్గుగా ఉందన్నారు. చివరకు అక్రమ సంపాదనను కాపాడుకునేందుకే శివకుమార్ స్థాపించిన వైకాపా పార్టీని కబ్జా చేసి శివకుమార్ కు సైతం వెన్నుపోటు పొడిచారని గుర్తు చేశారు.

ఎత్తుకుని పెంచిన బాబాయ్ ని గొడ్డలి వేటుతో నరికి చంపిన కిరాతకులని కాపాడుతూ రక్తసంబంధానికి వెన్నుపోటు పొడిచిందెవరో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసన్నారు. మద్యపాన నిషేధం పై మాట తప్పి విషపూరిత మద్యం పోసి పేదల ఆరోగ్యానికే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి జగన్ అని మండిపడ్డారు.
బీసీ, ఎస్సీ , ఎస్టీ, మైనారిటీ సబ్ ప్లాన్ నిధులు లక్ష కోట్లు దారి మళ్లించి సామాజిక న్యాయానికి వెన్నుపోటు పొడిచాడని జగన్ పై మండిపడ్డారు.16,347 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి .. మొదటి సంతకం మాట నిలబెట్టుకున్న తమ అధినేత పై తప్పుడు మాటలు చెప్పడం జగన్ దిగజారుడు తనం అన్నారు.
అధికారంలోకి రాగానే రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమం మొదలుపెట్టాం. ఇప్పటికే రూ.1200 కోట్లు ఖర్చు చేసి 20 వేల కి.మీ రోడ్లు బాగు చేసాం అని తెలిపారు. మళ్ళి వర్షాలు వచ్చాయి. దెబ్బతిన్న రోడ్లను బాగుచేస్తాం. ఇది నిరంతర ప్రక్రియ. గత ప్రభుత్వంలా వదిలెయ్యం. వెన్నుపోటు అంటూ ధర్నాలు చేయటం దొంగే దొంగ అన్నట్లుగా ఉందని జగన్ ముఠా పై విమర్శలు గుప్పించారు.