పాయకరావుపేట హోం మంత్రి అనిత మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీని.
సాక్షిత : అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీని కార్యక్రమంలో హోం మంత్రి అనిత ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం-మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం అన్నారు.ప్రధాని మోదీ,సిఎం చంద్రబాబు,డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు.గత ఐదు సంవత్సరాలగా గ్యాస్ పొయ్య వెలిగించాలి అంటే మహిళలు భయపడేవారన్నారు.గతంలో గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగి-ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారని తెలిపారు.అప్పటిలో మహిళల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు దీపం పథకం ప్రవేశపెట్టారు.ఇప్పుడు మరల దీపం-2 పథకం ప్రవేశపేట్టి,మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం అన్నారు.రాష్ట్ర ఖజనాలో ప్రస్తుతం డబ్బులు లేవన్నారు.త్వరలో పాయకరావుపేటలో అన్నా క్యాంటీన్ ప్రారంభింస్తాం అని చెప్పారు.
పాయకరావుపేట నియోజకవర్గంలో మేము వేసిన రోడ్లు తప్ప-ఒక్క రోడ్డు వేయలేదని ఎద్దేవాచేశారు.త్వరలో పాయకరావుపేటలో డబుల్ రోడ్డు వేస్తాం అని హామీ ఇచ్చారు.పాయకరావుపేటకు ఒక గుర్తింపు తీసుకువస్తాం అని అన్నారు. వైసిపి పాలనలో గ్రామ సర్పంచ్ లకు చేతులకు సంకేళ్ళు వేసారన్నారు.ఏన్డీయే ప్రభుత్వంలో గ్రామాలు అభివృధ్ధి చెందుతాయన్నారు. అధికారుల్లో ఇంకా పాత వాసన బాగా ఉందని ఆగ్రహం వ్యక్తంచేశారు.అధికారులు నిర్లిప్తత వీడాలన్నారు.నేను ఎక్కడ ఉన్నా-ఏ అధికారి ఎలా పని చేస్తున్నారో డేటా ఉంటుందన్నారు.నేను ఎప్పుడు అధికారులను సస్పెండ్ చేసే విధంగా చర్యలు తీసుకోలేదని అన్నారు.అలాంటి పరిస్థితిని నా వద్ద తీసుకు రావద్దని అన్నారు.అధికారులు తప్పు చెస్తే-ఉపేక్షించేంది లేదన్నారు.ఎవ్వరైనా అధికారులు అవినీతి చేస్తే-తక్షణమే చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.