TEJA NEWS

రౌడీలు పద్ధతి మార్చుకోకుంటే పీడీ యాక్ట్: రామగుండం సీపీ

రౌడీలు పద్ధతి మార్చుకోకుంటే పీడీ యాక్ట్: రామగుండం సీపీ
రౌడీలు ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని లేదంటే పీడీ యాక్ట్ అమలు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. మంచిర్యాలలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో రౌడీ షీటర్లలో మార్పు తీసుకొచ్చేందుకు ఆయన కౌన్సిలింగ్ నిర్వహించారు. నేర ప్రవృత్తిని మార్చుకోవడానికి అవకాశం ఇస్తున్నామన్నారు. హత్యా నేరాలకు పాల్పడిన కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు పడేలా చూడాలని అధికారులను ఆదేశించారు.


TEJA NEWS