పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రచారం చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు . చింతకుంట విజయరమణ రావు ..
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే యువతకు 30 లక్షల ఉద్యోగలు భర్తీ…
ఉపాధి హామీ కూలీలకు రోజుకు ₹400 రూపాయలకు పెంపు…
—- ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ..
సుల్తానాబాద్ మండలం, ఐతరాజ్ పల్లి, భూపతిపూర్ మరియు ఎలిగేడు మండలం సుల్తాన్ పూర్ మరియు నారాయణరావు పల్లి (కట్టకిందపల్లి) గ్రామాలల్లో పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా ఐతరాజ్ పల్లి . రాముల వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి అయిన గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం గ్రామాలల్లో ఉన్న ప్రజలను, ఉపాధి హామీ కూలీలను కలిసి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓట్లు వేయాలని అభ్యర్థించిన పెద్దపల్లి శాసనసభ్యులు . చింతకుంట విజయరమణ రావు …
ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ
కాక వెంకటస్వామి మనవడు, వివేక్ కుమారుడు, గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గా మీ ముందుకు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి వారికి భారీ మెజారిటీతో ఆశీర్వదించాలని కొరారు…
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే 6 గ్యారంటీలను అమలు చేస్తామని అ రోజు ప్రచారంలో చెప్పడం జరిగింది. చెప్పిన విధంగా అమలు చేస్తున్నాం.
ప్రజలందరి ఆశీర్వాదంలో కాంగ్రెస్ పార్టీ, మీ విజ్జన్న ఎమ్మెల్యేగా గెలుపొందిన 100 రోజుల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 6 గ్యారంటీలలో భాగంగా 5 గ్యారంటీలను అమలు చేయడం జరిగింది..
ఎన్నికలు కోడ్ తరువాత మరో గ్యారంటీ అయినా ₹ 2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేయడం జరుగుతుంది..
శ్రీమతి సోనియా గాంధీ పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా 5 న్యాయ గ్యారంటీలను ప్రవేశపెట్టడం జరిగింది…
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి పంటకు కనీస మద్దతు ధర,ఉపాధి హామీ కూలీలకు రోజుకు ₹ 400 పెంపు, ప్రతి పేద కుటుంబ మహిళకు ఏటా 1 లక్ష రూపాయలు, ఆరోగ్య బీమా 25 లక్షలు, యువతకు 30 లక్షల ఉద్యోగలు కలిపించడం జరుగుతుందన్నారు..
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 5 న్యాయ గ్యారంటీలను అమలు చేయడం జరుగుతుందని అన్నారు..
బీజేపీ, బి.ఆర్.ఎస్ ప్రభుత్వాలు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజలకు ఏం చేసారో చెప్పాలని..
BRS ప్రభుత్వంలో వడ్లు కటింగ్ చేసి రైతులను మోసం చేసిన ఘనత BRS ప్రభుత్వనీది అని విమర్శించారు.
పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయనా గడ్డం వంశీకృష్ణ కి మీ అమూల్యమైన ఓటు వేసి పెద్దపల్లి నియోజకవర్గంలో భారీ మెజారిటీ ఇవ్వాలని ప్రజలను కోరడం జరిగింది..
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, ఉపాధి హామీ కూలీలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.