తెలుగుదేశంతోనే ప్రజలకు సంక్షేమం
లోకేష్ బాబు చొరవతోనే 2 లక్షల ప్రమాద భీమా 5 లక్షలకు పెంపు.
ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
కార్యకర్తల త్యాగాల ఫలితంగానే 2024 లో తెలుగుదేశంపార్టి అధికారం లోనికి వచ్చిందన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి బుచ్చిరెడ్డి పాళెంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆమె జిల్లా టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వం స్వీకరించారు.ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తనయులు అర్జున్ రెడ్డి తరుపున ఆమె పార్టీ శాశ్వత సభ్యత్వానికి దరఖాస్తు చేశారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన 42 సంవత్సరాల తరువాత కూడా పార్టీ సుస్థిరంగా వుందంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్ధతే కారణమన్నారు. కార్యకర్తల సంక్షేమానికి సంబంధించి భారతదేశంలో రాజకీయ పార్టీలకు టిడిపి రోల్ మాడల్ లాంటిదన్నారు. కార్యకర్తలకు గుర్తింపు కార్డుతో పాటు ప్రమాద భీమా లాంటి సౌకర్యాలు తెలుగుదేశం పార్టి కల్పించడం చూసాకే దేశంలోని మిగతా పార్టీలు టిడిపిని ఫాలో అవుతున్నాయన్నారు.
మంత్రి లోకేష్ రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చాక పార్టీలో కార్యకర్తల ప్రాధాన్యత పెరిగిందన్నారు. కష్టాల్లో వున్న పార్టీ క్యాడర్ ను ఆదుకునేందుకై కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసిన ఘనత లోకేష్ బాబు దేనన్నారు. గతంలో 2 లక్షలు వున్న ప్రమాద బీమాను 5 లక్షలకు పెంచడమే కాకుండా కార్యకర్తల పిల్లలకు చదువు, కుటుంబ సభ్యులకు వైద్యం, ఉపాధి లాంటో సౌకర్యాలుకల్పించే రాజకీయ పార్టీ దేశంలో మరేదైనా వుందా అని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి, టిడిపి రాష్ట కార్యదర్శులు చెముకుల కృష్ణ చైతన్య,శేఖర్ రెడ్డి, బుచ్చి రూరల్ మరియు అర్బన్ టిడిపి అధ్యక్షులు బత్తుల హరికృష్ణ, ఎంవి శేషయ్య, కోవూరు టిడిపి అధ్యక్షులు ఇంతా మల్లారెడ్డి, ఇందుకూరు పేట టిడిపి అధ్యక్షులు రావెళ్ల వీరేంద్ర నాయుడు, రాష్ట్ర బిసి సాధికారిక అధ్యక్షులు పిఎల్ రావు, బుచ్చి మున్సిపల్ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ, టిడిపి నాయకులు చెంచు కిషోర్, వెంకటరమణమ్మ, బెజవాడ వంశీ కృష్ణా రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, యర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి, భూలోక విజయకుమార్, జెట్టి రాజ గోపాల్ రెడ్డి, జెట్టి మదన్ మోహన్ రెడ్డి, మైనారిటీ నాయకులు జమీర్, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.