TEJA NEWS

మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారిని కలిసి బౌరంపేట జిల్లా పరిషత్ హై స్కూల్ గురించి వినతిపత్రం ఇవ్వడం జరిగింది

అరకొర సదుపాయలతో కేవలం ఎకరా స్థలం లో (కారణం బౌరంపేట్ చుట్టుపక్కల ఇందిరమ్మ కాలనీ డబల్ బెడ్రూమ్ మరియు వివిధ కాలనీలు ఏర్పడి) సుమారు 900 మంది విద్యార్థుల సంఖ్య పెరిగి ప్రస్తుతం ఆట స్థలం లేక కనీసం ప్రేయర్ చేయడానికి కూడా ఇరుకు ఇరుకుగా ఉన్న వరండాలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు కావున ప్రభుత్వ పాఠశాల కోసం బౌరంపేట లో గల ప్రభుత్వ భూములలో ఏదేని ఒక సర్వెనెంబర్ 5 ఎకరాల స్థలం కేటాయించగలరని కోరడం జరిగింది మరియు ప్రభుత్వ పాఠశాలలో మంచి నీటి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తక్షణమే ఒక బోర్ వేసి నీటి సౌకర్యం కల్పించగలరని ఎంపీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎంపీ గారిని కలిసిన వారిలో బీజేపీ నాయకులు పీసరి కృష్ణారెడ్డిగారు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు మోడీగారి శ్రీధర్ గారు డి ప్రభాకర్ రెడ్డిగారు గోనె మల్లారెడ్డి నల్ల రాంచంద్రరెడ్డి డి సీతారాం రెడ్డి రాజిరెడ్డి పాల్గొన్నారు


TEJA NEWS