TEJA NEWS

వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతూ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ కి వినతి పత్రం…

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద తెలంగాణ వడ్డెర సంఘం సభ్యులు ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసి వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వడ్డెర సంఘం సభ్యులు వడ్డెర కులస్తుల పిల్లలకు గురుకుల పాఠశాలలో ఎటువంటి ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా సీట్లను కేటాయించడంతోపాటు, బండ క్వారీలు, క్రషర్లపై పూర్తిగా వడ్డెర కులస్తులకే హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల బడ్జెట్ కేటాయించి బ్యాంకు కన్సల్టేషన్ లేకుండా వడ్డెర యువతకు లోన్లు ఇవ్వాలని, వడ్డెర కులస్తులకు రాజకీయంగా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలని వినతిపత్రం కోరారు.

అనంతరం ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ వడ్డెర కులస్తుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఎస్టీ జాబితాలో చేర్చేలా కృషి చేస్తానన్నారు.

ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి అయిలమల్లు, గౌరవాధ్యక్షులు పీట్ల మల్లేష్, వడ్డెర సంఘం సభ్యులు జెరిపేట్ రాములు, శ్రీను, యాది, కె. హన్మంతు, సిహెచ్.రాజు, తిమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS