TEJA NEWS

ప్రజా సమస్యల పరిష్కార వేదిక

విజయవాడ,
మహారాజశ్రీ గౌరవనీయులైన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దివ్య సమూహమునకు.

విషయము: ప్రభుత్వ అనుమతులు లేకుండా విజయవాడలో అయ్యప్ప నగర్ లో నిర్వహిస్తున్న మాస్టర్ మైండ్ మరియు Beersheba పాఠశాలల నిర్వహణ వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.

అయ్యా !

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుల గురించి ఆలోచించి, ప్రభుత్వ అనుమతులతో ప్రైవేట్ పాఠశాలను నిర్వహించాలని తద్వారా విద్యార్థుల విద్యాభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వ ఉద్దేశం. దీనిని కొంతమంది వ్యక్తులు అనుమతులు లేకుండా, ప్రభుత్వ నిబంధనలను పాటించకుండానే వ్యాపార దృష్టిలో విద్యా వ్యవస్థను నడుపుతున్నారు.

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అయ్యప్ప నగర్ లోని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాఠశాలను ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ అధికారి తనిఖీలు చేసి పాఠశాలలను మూసివేయాలని RC నెంబర్ 5244/A1/2024 గా ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు.సదరు ఉత్తర్వులను సైతం బేఖాతరు చేయడంతో కే.అప్పారావు అనేటువంటి వ్యక్తి మా ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ఫెడరేషన్ ఎన్టీఆర్ జిల్లా వారికి రాతపూర్వకంగా సమస్యను విన్నయించుకున్నారు.సదరు విషయమై మేము వాస్తవాలను పరిశీలించడానికి వెళ్లడం జరిగింది. ఆ సందర్భంలో జిల్లా విద్యాశాఖ అధికారికి మరియు అయ్యప్ప నగర్ లో మండల విద్యాశాఖ అధికారి గారికి ఫోన్ ద్వారా వాస్తవాలను తెలుసుకొనుటకు రమ్మని ప్రయత్నం చేయగా, వారు ఫోను స్పందించలేదు. సదర విషయాన్ని నేను అనగా ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ఫెడరేషన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కరిసే మధు అను నేను తమరి కార్యాలయానికి, జెసి కార్యాలయానికి, డీఈఓ మరియు ఎంఈఓ కార్యాలయానికి వాట్సాప్ ద్వారా సమాచారాన్ని తెలియపరచి ఉన్నాను.

మాస్టర్ మైండ్ మరియు Beersheba పాఠశాల నిర్వహణనీ జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వుల ఆదేశానుసారంగా మూసి వేయించి సదరు నిర్వహణ యాజమాన్యంపై ఇప్పటి వరకు ప్రభుత్వ ధిక్కరణ ఆదేశాలను ధిక్కరించడంతో, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని కేసు నమోదు చేయవలసిందిగా కోరుతున్నాము. ప్రస్తుతం విద్యాశాఖ అకాడమిక్ ఇయర్ ముగిస్తుండడంతో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను సమీప పాఠశాలలో చేర్పించవలసిందిగా కోరుతున్నాను.

ఇట్లు
ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ఫెడరేషన్
ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు.
కరిసే మధు


TEJA NEWS