TEJA NEWS

Police scouring the villages

సత్తెనపల్లి నియోజకవర్గం

గ్రామాలను జల్లెడ పడుతున్న పోలీసులు

ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో సత్తెనపల్లి సర్కిల్ సీఐ రాంబాబు తన సిబ్బందితో గ్రామాలన్ని జల్లెడ పడుతున్నారు.

మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్లు లెక్కింపు సమయం దగ్గర పడుతుండటంతో అప్రమత్తంగా నిబద్ధతగా అనుక్షణం కంటికి కునుకు లేకుండా రాత్రనకా పగలనకా గాలింపు చర్యలు చేపట్టామన్నారు

బాంబులు కత్తులు మరణాయుధాలు కర్రలు, గొడ్డలు రాళ్లు ఏమైనా దొరుకుతాయేమోనని విస్తృతంగా కంపల్లో, గుట్టల్లో, కొట్టల్లో,చెత్త దిబ్బల్లో, రహస్య ప్రదేశాలన్నిటిని విధి నిర్వహణలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా గాలిస్తున్నామన్నారు

ఓట్లు లెక్కింపులో రాష్ట్ర ప్రజలు హింసాత్మక సంఘటనలకు పాల్పడితే కఠినంగా కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు

ప్రజలు సమయానం పాటించి పోలీసు వారికి సహకరించవలసినదిగా కోరుతున్నారు.

ఓట్లు లెక్కింపు సమయంలో రాష్ట్రంలో ఏ గ్రామంలోనైనా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగిన వెంటనే పోలీసులకు ఫోన్ చేయాలని తెలియజేశారు.

ఎన్నికల జరిగిన 13వ తేదీ నుండి ఈరోజు వరకు మండలంలో ప్రశాంత వాతావరణం ఉండేలా తన సిబ్బందితో కలిసి చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు

గొడవలు గాని అల్లర్లు గాని సృష్టిస్తే ఎంతటి వారినైనా చట్టం వదలదని అన్నారు.

ప్రధాన ప్రాంతాలలో అన్నిచోట్ల సీసీ కెమెరాలు ఉన్నట్లు, ఏమి చేసినా పోలీసు వారికి వెంటనే తెలిసిపోతుందని, కేసుల్లో పడితే జీవితాలు అన్యాయంగా నాశనం అవుతాయని అన్నారు.

యువత అనవసరమైన గొడవలకు పాల్పడి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు అని మంచి చెప్పారు.

గత కేసుల్లో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారని వారిని కూడా అరెస్టు చేస్తామని అన్నారు

సత్తెనపల్లి నియోజకవర్గంలో చెలరేగిన గొడవలు అల్లర్లకు పాల్పడిన వారి మీద ప్రత్యేక నిఘా కలిగి ఉన్నామని, సర్కిల్ సీఐ రాంబాబు ఎల్లప్పుడూ స్టేషన్లోనూ, సమస్యాత్మక ప్రాంతాలలో ప్రజలకు,అందుబాటులో ఉంటున్నానన్నారు.

తన సిబ్బందితో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నామన్నారు

పాత కేసుల పైన రౌడీ షీటర్ల పైన, సస్పెక్ట్ షీటర్ల పైన ప్రత్యేక నిఘా కలిగి ఉన్నామని తెలియజేశారు.

ఎవరైనా రెండు మూడు కేసులతో సంబంధం కలిగి ఉంటే వారి పైన కూడా పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు అవుతాయని, రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేస్తామని తెలియజేశారు

వాహనదారుల దగ్గర బండి పేపర్స్ లేకపోయినా

నంబర్ ప్లేట్స్ లేకపోయినా కేసులు నమోదు అవుతాయని తెలియజేశారు.

సిసి కెమెరాల ఆధారంగా వీడియోస్ ఆధారంగా కూడా గొడవలకు పాల్పడిన వారిని గుర్తించి అరెస్టు చేస్తామని తెలియజేశారు.


TEJA NEWS