TEJA NEWS

మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్‌

హైదరాబాద్:
ఉదయం 7 గంటల నుంచి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతు న్నాయి. నవంబర్ 23 శనివారం న ఓట్ల లెక్కింపు, ఫలితాలను ఎన్నికల కమిషన్ వెల్లడించనుంది.

అయితే, రెండు ప్రధాన పార్టీలు శివసేన, ఎన్సీపీ – ఏకనాధ్ షిండే, అజిత్ పవార్ నేతృత్వంలో చీలిన తర్వాత తొలిసారిగా ఈ అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్నాయి. ఎన్డీయే కూటమిలోని ప్రధాన భాగస్వామ్య పక్షమైన బీజేపీ మొత్తం 149 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుండగా..

ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే నేతృత్వంలోని “శివసేన” 81 స్థానాల్లో, అజిత్ పవార్ నేతృత్వంలో ని “నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ” 59 స్థానాల్లో బరిలోకి దిగింది. ఇక, “ఇండియా” కూటమిలో ప్రధాన భాగస్వామ్య పక్షమైన కాంగ్రెస్ పార్టీ 101 అసెంబ్లీ స్థానాల్లో, ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని “శివసేన” 95 స్థానాల్లో, శరద్ పవార్ నేతృత్వంలోని “నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ” 86 స్థానాల్లో పోటీ చేస్తున్నారు.

ఇంకా 17 స్థానాల్లో మజ్లీస్ పార్టీ, “ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇత్తెహాద్ ఉల్ ముస్లి పోటీ చేస్తున్నారు. అలాగే, మహారాష్ట్రలో “బహుజన సమాజ్ పార్టీ” మొత్తం 237 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఎన్నికల బరిలో సీఎం ఏకనాధ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, ఆదిత్య థాకరే, మిలింద్ దియోరా, పీసీసీ అధ్యక్షుడు నానా పటోలే ఉన్నారు.

ఈ పోలింగ్ ప్రక్రియ నేటి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు గాను.. రాష్ట్రంలో మొత్తం 9 కోట్ల 70 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇక, 4,136 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. అందులో 2,086 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు.


TEJA NEWS