యాదవ విద్యార్థులకు ప్రతిభ పురస్కార అవార్డుల ప్రధానోత్సవం

యాదవ విద్యార్థులకు ప్రతిభ పురస్కార అవార్డుల ప్రధానోత్సవం

TEJA NEWS

Pratibha Puraskar Award ceremony for Yadav students

యాదవ విద్యార్థులకు ప్రతిభ పురస్కార అవార్డుల ప్రధానోత్సవం

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

సాక్షిత మల్కాజిగిరి : యాదవ్స్ సేవ సంఘం వారి ఆధ్వర్యంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ లో ప్రతిభా చాటిన విద్యార్థులకు ప్రతిభా పురస్కార అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని మల్కాజిగిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని మనిషా గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి పదవ తరగతి ఇంటర్మీడియట్ లో ప్రతిభా చాటుకున్న 250 మంది విద్యార్థులను ఘనంగా సన్మానించి సర్టిఫికెట్ తో పాటు మెమొంటోని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాకుడు అల్లాడి శరత్ యాదవ్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుండి యాదవ విద్యార్థులను ప్రోత్సహించడానికి ప్రతిఏటా విద్యలో ప్రతిభ చాటిన విద్యార్థులను ఎంపిక చేసి సన్మానిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మహేష్ యాదవ్, జంగాల శ్రీరామ్ యాదవ్, అయోధ్య రామ్, శ్రీకాంత్ యాదవ్, యాదవ్, సునీత,సిద్దేశ్వర యాదవ్, టీ.శివ కుమార్ యాదవ్,జితేందర్ యాదవ్,జయ లక్ష్మి , తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS

Comments

No comments yet. Why don’t you start the discussion?

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి