TEJA NEWS

ఉగాది పండుగ రోజు ముస్లింలకు రంజాన్ తోఫా అందజేసిన పృథ్వీరాజ్

ముస్లిం సోదరులకు ముందుగా రంజాన్ శుభాకాంక్షలు.

తండ్రి దేవేందర్ రాజు సమక్షంలో అందించిన పటాన్‌చెరు యువనాయకుడు మాదిరి ప్రిథ్వీరాజ్.

పటాన్ చెరు పట్టణం లో ముస్లిం సోదరులకు #MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్ రంజాన్ తోఫా అందించారు. దేవేందర్ రాజు సమక్షంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ… అల్లాను స్మరిస్తూ నెల రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్దలతో కఠిన ఉపవాసాలు చేసిన తమ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా రంజాన్ పండగ చేసుకోవాలన్నారు. గత కొన్నేళ్ల నుంచి తాతగారు జైపాల్ ముదిరాజ్ పేద ముస్లిం మహిళలకు చీరలు పంపిణీ చేస్తూ, #MDR ఫౌండేషన్ నుంచి ముస్లిం సోదరులకు తోఫా పంపిణీ చేస్తున్నాము అని అన్నారు. పటాన్ చెరు పట్టణంలోని #MDR ఫౌండేషన్ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.


TEJA NEWS