TEJA NEWS

గుడివాడలో జాతీయ రహదారుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి:ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

నేషనల్ హైవే అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యే…

సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించిన..ఎమ్మెల్యే రాము

గుడివాడ : గుడివాడ పట్టణ పరిధిలోని జాతీయ రహదారుల్లో నెలకొన్న ప్రధాన సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని నేషనల్ హైవే అధికారులతో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు.

గుడివాడ ఏలూరు రోడ్డులోని టిడిపి కార్యాలయం ప్రజా వేదికలో.. ఆర్డీవో బాలసుబ్రమణ్యంతో కలిసి.. నేషనల్ హైవే అధికారులతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా ఆర్ఓబి నిర్మాణంతో ఎదురవుతున్న సమస్యల పరిష్కారంపై..దృష్టి పెట్టాలని అధికారులతో ఎమ్మెల్యే రాము అన్నారు. పలు ప్రధాన సమస్యలను అధికారుల దృష్టికి ఎమ్మెల్యే రాము తీసుకువచ్చారు.

సమస్యల పరిష్కారానికి తీసుకోనున్న చర్యలను నేషనల్ హైవే డి.ఈ సత్యనారాయణ.. ఎమ్మెల్యే రాముకు వివరించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా త్వరగతిన సమస్యలను పరిష్కరించాలని సమావేశంలో అధికారులతో ఎమ్మెల్యే రాము అన్నారు.

గుడివాడలో నెలలు తరబడి అపరిస్కృతంగా ఉన్న పలు సమస్యలకు పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. ప్రధానంగా ఆర్ఓబి ముగింపు నుండి ఏలూరు రోడ్డులోని వి.కే.ఆర్ & వి.ఎన్.బి ఇంజనీరింగ్ కళాశాల వరకు రోడ్ల విస్తీర్ణ మరియు డ్రైనేజీల అభివృద్ధి పనులు అతి త్వరలో ప్రారంభం కానున్నాయని ఎమ్మెల్యే రాము తెలియజేశారు.

ఈ సమావేశంలో ఏ.ఈ శరత్ చంద్ర పలువురు అధికారులు పాల్గొన్నారు.


TEJA NEWS