TEJA NEWS

మార్కెట్లు, పార్కింగ్ స్థలాలకు గురువారం బహిరంగ వేలం : నగర మేయర్ డాక్టర్ శిరీష,కమిషనర్ అదితిసింగ్
…………………………………………………………………………………..
సాక్షిత తిరుపతి నగరపాలక :
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని మార్కెట్లకు, పార్కింగ్ స్థలాలకు 18 వ తేదీ ఉదయం 11.00 గంటలకు బహిరంగ వేలము నిర్వహించబడునని, సీల్డ్ టెండర్ల ద్వారా పాల్గొనని వారు కూడా నేరుగా బహిరంగ వేలంలో పాల్గొనవచ్చునని నగరపాలక సంస్థ మేయరు మరియు కమిషనర్ తెలియజేశారు.
బహిరంగ వేలములో డిపాజిట్ చెల్లించి నిబంధనల మేరకు అర్హులైన అందరూ పాల్గొనవచ్చునని అని మేయర్ డాక్టర్ శిరీష,కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్ తెలియజేశారు. ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ సముదాయము, రామచంద్ర గుంటకట్ట కూరగాయల మార్కెట్, జంతు వధశాల, పార్కింగ్ స్థలాలకు మార్చి 31, 2025 వరకు రుసుము వసూలు చేసుకొనుట కొరకు సీల్డ్ టెండర్, బహిరంగ వేలము నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు నగరపాలక సంస్థ ఉప కమిషనర్ ని సంప్రదించాలని మేయర్ డాక్టర్ శిరీష,కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్ తెలిపారు. నిబంధనల ప్రకారం జరుగు బహిరంగ వేలం కు గురువారం ఉదయం 10 గంటలకు హాజరు కాగలరని తెలియజేశారు.


TEJA NEWS