విజయవాడలో ఏపీసీసీ అధ్యక్షురాలు వై.యస్. షర్మిల రెడ్డి సమక్షంలో చేరిక
ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామానికి చెందిన స్థానిక మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్ రెడ్డి సోదరుడు రాకెట్ల వై. మధుసూదన్ రెడ్డి గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఏపీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల రెడ్డి సమక్షంలో పార్టీలో చేరగా ఆమె ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వై.మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఉరవకొండ నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది.
వై.విశ్వేశ్వరరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి అసెంబ్లీ కు పోటీ చేస్తుండగా అదే స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున సోదరుడు వై. మధుసూదన్ రెడ్డి బరిలో దిగనున్నారు…