డిజిటల్ మీడియా ముసుగులో అరాచకాలు నిలిచి పోయిన ఆర్ ఎన్ ఐ
Digital marketing concept. Human hand with a megaphone surrounded by media icons

డిజిటల్ మీడియా ముసుగులో అరాచకాలు నిలిచి పోయిన ఆర్ ఎన్ ఐ

TEJA NEWS

డిజిటల్ మీడియా ముసుగులో అరాచకాలు…

నియంత్రణ కు సిద్ధం అయిన కేంద్రం…

నిబంధనలు 2021 కఠినం గా అమలు కు రంగం సిద్ధం…

నిలిచి పోయిన ఆర్ ఎన్ ఐ…

పిర్యాదు లేకుండనే పోలీస్ చర్యలకు అవకాశం…

2024-ఫిబ్రవరి – 5

డిజిటల్ మీడియా ముసుగు లో షోషల్ మీడియా వేదిక గా కొంతమంది చేస్తున్న అక్రమ వ్యవహారాలు కు చెక్ పెట్టె దిశగా కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ చర్యలు చెపట్టింది. ఇప్పటికే న్యూస్ పేపర్ రిజిస్ట్రేషన్ (ఆర్ ఎన్ ఐ ) అప్లికేషన్ వెబ్ సైట్ ఆపు చేసింది. పలు కిలక మార్పులు ప్రతీ పాదిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యంతరాలు ఉంటే తెలియ చేయాలి అని కోరింది. ఆర్ ఎన్ ఐ అనుమతి కఠిన తరం చేశారు. అది విధంగా ఉండగా మంత్రి త్వ శాఖ లో, ప్రింట్, ఎలక్ట్రానిక్ లాగ డిజిటల్ మీడియా విభాగం నెల కొల్పడం జరిగింది. అధికారుల ను నియ మించారు. ఈ విభాగం లో ఇప్పటి కె దేశ వ్యాప్తంగా 61 డిజిటల్ మీడియా సంస్థలు రిజిస్టర్ అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్ర ల లో మొత్తం మూడు దరఖాస్థులు వచ్చినట్లు, అవి విచారణ దశలో ఉన్న ట్లు గా సమాచారం. 2021 లో కేంద్రం డిజిటల్ మీడియా కీ చట్ట బద్దత కల్పిస్తూ కొన్ని నియమాలు రూపొందించింది. దీని ప్రకారం అడ్డ గొలుగా వ్యవహ రించ కుండా తమని తాము మీడియా సంస్థలు నియంత్రణ చేసుకోవాలి. నిబంధన ల అతిక్రమణ తీవ్ర రూపం లో ఉంటే ఎటువంటి
పిర్యాదు లేకుండ స్థానిక పోలీస్ స్టేషన్ అధికారి చర్యలు తీసుకొవచ్చు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ల కు వర్తించే ప్రతీ నిబంధన డిజిటల్ కీ వర్తిస్తుంది. కేంద్రం లోని సమంది త విభాగం లక్ష ల్లో జరిమానా, జైలు శిక్ష ప్రతీ పాదన చెయ్య వచ్చు. డిజిటల్ మీడియా కార్యలయం, కార్య నిర్వహికుడు రెండు భారతదేశం అడ్రెస్ తో ఉండాలి. ఆమేరకు వివరాలు తో బోర్డు లు ఉండాలి. స్వీయ నియంత్రణ కమిటీ, పిర్యాదు ల కు ఫోన్ నెంబర్, ప్రతీ ఆన్లైన్ కంటెంట్ (వార్త ) కీ జోడించాలి. ఇలా అనేక నిబంధనలు ఉన్నాయి. ఎవరు పడితే వారు, కనీసం అడ్రెస్ కూడా సరిగా లేని వారు, యూట్యూబ ర్ లు కొంతమంది మాది ఛానల్, డిజిటల్ మీడియా అని ప్రకటన లు ఇవ్వడం, ఆన్లైన్ లో అడ్డగోలుగా కంటెంట్ (సమాచారం) పెట్టటం చేస్తున్నారు. డిజిటల్ మీడియా పేరుతో సంఘాలు వెలిసాయి. షోషల్ మీడియా పరిధి లోకి పైవి వస్తా యి. ఆ షోషల్ మీడియా దుర్వినియోగం అరికట్టటం కోసం కేంద్రం డిజిటల్ ఫ్లాట్ ఫాం అనేది మీడియా విభాగం లోకి తెచ్చిన ట్లు గా తెలుస్తోంది. కరోనా కాలం నుండి డిజిటేల్ మీడియా ప్రాధాన్యత పెరిగింది. దానిని కొందరు షోషల్ మీడియా వాళ్ళు డిజిటల్ మీడియా ముసుగు వేసుకొని మొత్తం గా జర్నలిస్ట్ వృత్తి స్థాయి ని దిగజారుస్తున్న నేపథ్యంలో కేంద్రం డిజిటల్ మీడియా నిబంధనలు అమలు కొంత వరకు ప్రయోజనం గా ఉండే అవకాసం ఉంది.

Digital marketing concept. Human hand with a megaphone surrounded by media icons
Print Friendly, PDF & Email

TEJA NEWS