TEJA NEWS

దోమల వ్యాప్తి చెందకుండా పటిష్టంగా పారిశుద్ధ్య పనులు చేపట్టాలి : మున్సిపల్ కమిషనర్

చిలకలూరిపేట : పారిశుద్ధ్య పనులను అకస్మిక తనిఖీలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్ పతి శ్రీ హరిబాబు పట్టణంలోని మార్కెట్ సెంటర్, గుర్రాల చావిడి బోస్ రోడ్, వేలూరు రోడ్డులోని వైయస్సార్ విగ్రహం తో పాటుగా పలు వార్డుల్లో కమిషనర్ విస్తృత పర్యటన చేసి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ శ్రీహరి బాబు మాట్లాడుతు చలి కాలంలో
దోమల వ్యాప్తి ఎక్కువ ఉంటుంది, దోమలు వృద్ధి చెందితే విష జ్వరాలు తో పాటుగా పలు అంటూ వ్యాధుల తో పాటుగా చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు రాబోయే ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని,వార్డుల పరిధిలో పారిశుద్ధ్య పనులు నిర్వహించే సమయంలో నివాసాల ముందు నీటి తొట్టెలు , పసు కుడితి తొట్టెల్లో దీర్ఘ కాలంగా నీరు నిల్వ ఉన్నట్లయితే ఆ ఇంటి యజమానులకు ఒకటి రెండు సార్లు నీరు నిల్వ ఉంచకూడదు అని హెచ్చరించలని ఆదేశించారు,రోజు వారి పారిశుద్ధ్య పనులు నిర్వహణ లో శానిటరీ మేస్త్రులు శానిటేషన్ కార్మికులు, ఇన్స్పెక్టర్లు పారిశుద్ధ్య కార్మికులు,సచివాలయ సెక్రటరీలు,
ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పని చేయాలని విధులలో అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదని తెలిపారు
ఈ కార్యక్రమంలోశానిటరీ ఇన్స్పెక్టర్ సునీత మేస్త్రిలు సతీష్ ,రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS