TEJA NEWS

మోకిలా గ్రామంలో విస్తృత ప్రచారం కొనసాగించిన మండల బిజెపి సీనియర్ నాయకులు , వెంకట్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ex mptc యాదయ్య, వెంకటయ్య.


శంకర్పల్లి : శంకర్పల్లి మండలం పరిధి మోకిల గ్రామంలో మండల సీనియర్ బిజెపి నాయకులు గడపగడప కు తిరుగుతూ విస్తృత ప్రచారం
కొనసాగించారు. వారు మాట్లాడుతూ గత పది సంవత్సరముల కాలంలో నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి పనులను ప్రచారం చేశారు. దేశ రక్షణకు నరేంద్ర మోడీ కట్టుబడి ఉన్నాడు. ప్రపంచ దేశాలు అన్ని మోడీ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నాయి. గ్రామ గ్రామాన మరుగుదొడ్లు, సిసి రోడ్లు, స్మశాన వాటిక, రైతు వేదిక, ఉచిత బియ్యం, కరోనా ఇంజక్షన్, ఆయుష్మాన్ భారత్, ఇలాంటి పనులను గల్లి నుండి ఢిల్లీ వరకు మోడీ అభివృద్ధి చేశారు. 500 సంవత్సరాల రామ మందిరం సమస్యను పరిష్కరించాడు. ట్రిపుల్ తలాక్ ను తీసివేసి ముస్లిం మహిళలకు ఎంతో మేలు చేశాడు. అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్ రూపంలో రిజర్వేషన్ కల్పించి వారి పాలిట దేవుడుగా నరేంద్ర మోడీ మారినాడు. ఈ కార్యక్రమంలో ప్రకాష్, శ్రీకాంత్, మహేష్, నరేందర్ రెడ్డి, సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS