TEJA NEWS

శంకర్‌పల్లి సీనియర్ జర్నలిస్టు మృతి

శంకరపల్లి : శంకర్‌పల్లి మున్సిపాలిటీకి చెందిన సీనియర్ జర్నలిస్టు నరసింహస్వామి (68) మృతి చెందారని ఆయన సోదరుడు సేవ ఫౌండేషన్ అధ్యక్షుడు నరేష్ కుమార్ తెలిపారు. ఉదయం 11 గంటలకు ఆయన అంత్యక్రియలు పట్టణంలో జరుగుతాయని పేర్కొన్నారు. నిజాయితీకి, విజ్ఞతకు మరో పేరు ఆయన అని స్నేహితులు, బంధువులు కొనియాడారు. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, ప్రజలు ఆయనకు సంతాపం వ్యక్తం చేశారు.


TEJA NEWS