TEJA NEWS

ఫంక్షన్ హాల్ సందర్శించిన శ్రీ సువిదేంద్ర తీర్థ స్వామి

ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సమీపంలో ఎస్ఎల్వీ ఫంక్షన్ హాల్ ను పట్వారి అరవిందరావు ఆధ్వర్యంలో నిర్మించారు. సోమవారం మల్దకల్ కు వచ్చిన స్వామీజీ ఫంక్షన్ హాల్ ను సందర్శించి పట్వారి అరవింద్ రావు కుటుంబ సభ్యులను ఆశీస్సులు అందజేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో వివాహాలు జరుపుకొనుటకు అన్ని వసతులు గల ఫంక్షన్ హాల్ నిర్మించడం పట్ల స్వామీజీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు మధుసూదనా చారి వెంకోబారావు బుచ్చారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు.


TEJA NEWS