
సికింద్రాబాద్ : సితాఫలమండీ ప్రభుత్వ డిగ్రీ కాలేజి ని ఉత్తమ విద్యా సంస్థగా తీర్చిదిద్దేలా తమ వంతు కృషి చేస్తామని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ గా కొత్తగా నియమితురాలైన డాక్టర్ జి.బంగ్ల భారతి పద్మారావు గౌడ్ తో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. కొత్త భవనాల నిర్మాణం, ఇతరత్రా అంశాల్లో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ 2015 లో తమ కృషి కారణంగా సితాఫలమండీ స్కూల్ లో జూనియర్ , డిగ్రీ కాలేజీలు ఎర్పటయ్యాయని తెలిపారు. కొత్త భవనాల నిర్మాణానికి రూ.29.75 కోట్ల మేరకు నిదులను గతంలో మంజూరు చేయించమని తెలిపారు. డిగ్రీ కాలేజీని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ భారతి తో పాటు అధ్యాపకులు పాల్గొన్నారు.
