హైదరాబాద్ :
దూర ప్రాంతాలకు వెళ్లి వచ్చే ఏసీ బస్సుల్లో మే 15 నుంచి ప్రయాణికులకు అందించే స్నాక్స్‌ను నిలిపివేస్తున్నట్టు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది.
టికెట్ చార్జీతో పాటు అద నంగా రూ.30 వసూలు చేస్తూ ఆర్టీసీ ప్రయాణికు లకు స్నాక్స్ సమకూర్చు తోంది. స్నాక్స్‌లో భాగంగా వాటర్‌బాటిల్‌తో పాటు మిల్లెట్స్ చిక్కి, రస్క్, కారా, టిష్యూ పేపర్ బాక్స్‌లో సరఫరా చేస్తున్నారు.
అయితే బస్సులు బయ లుదేరే సమయంలో తాజా స్నాక్స్‌ను ఆయా బస్‌స్టే షన్లలో నిల్వ చేయడం అధికారులకు సవాల్‌గా మారింది.
అలాగే ప్రయాణికులు స్నాక్స్ స్వీకరించిన తర్వాత కవర్‌లు, ఆహార పదార్థాలు బస్సు సీట్లపై అపరిశుభ్రంగా పడేస్తున్నారనే ఫిర్యాదుల ను పరిగణనలోకి తీసుకుని స్నాక్స్ సరఫరాను నిలిపి వేయాలని ఆర్టీసీ నిర్ణయిం చినట్టు తెలిసింది.